Ambedkar statue not resembling ambedkar

Ambedkar statue At AP Assembly, Ambedkar statue not resembling him, Kiran Kumar Reddy, speaker Nadendla Manohar, Dalit MLAs, Ambedkar statue unveiled

Ambedkar statue not resembling Ambedkar

అంబేద్కర్ విగ్రహంలో కిరణ్ కుమార్ పోలికలు

Posted: 01/21/2014 02:15 PM IST
Ambedkar statue not resembling ambedkar

23 లక్షల రూపాయల వ్యయంతో హర్యానాలోని గుర్గావ్ లో తయారు చేయించిన విగ్రహం మీద అంత వ్యయం అవుతుందా అని అనుమానాన్ని ప్రకటించినవాళ్లు, ఇంతా చేసి ఆ విగ్రహంలో పోలికలు అంబేద్కర్ ఫొటోలతో సరిపోలటం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. 

అంతేకాదు ఆ విగ్రహంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ పోలికలున్నాయంటూ వాళ్ళంతా ఆందోళనకు దిగారు.  అక్కడ పెట్టింది అంబేద్కర్ విగ్రహం కాదని కిరణ్ కుమార్ కి అంబేద్కర్ బట్టలు తొడిగినట్లుగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

సోమవారం శాసనసభ ఆవరణలో ప్రతిష్టించిన డాక్టర్ అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ పోలికలతో లేదని ప్రజాసంఘాలు కొన్ని విమర్శించాయి.  ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకెళ్ళిన దళిత ఎమ్మెల్యైతే ఆ విగ్రహాన్ని తీసేసి దాన్ని స్థానంలో అంబేద్కర్ రూపు రేఖలతో తయారు చేసిన విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేసారు. 

ఇటువంటి ఆరోపణలే లోగడ ట్యాంక్ బండ్ మీది విగ్రహాల మీద కూడా వచ్చాయి.  అన్ని విగ్రహాలలోనూ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రూపు రేఖలే కనపడుతున్నాయంటూ పలువురు ఆరోపించారు.

దీనిమీద వివరణనిస్తూ తన మీసాలకు, విగ్రహంలోని మీసాలకు, తన కళ్ళజోడుకి విగ్రహంలోని కళ్ళజోడుకి చాలా తేడా ఉందని, పైగా తను రాసేటప్పుడు చదివేటప్పుడు తప్ప కళ్ళజోడు పెట్టుకోనని, తనెప్పుడూ ఆ విధంగా చెయ్యి పైకెత్తి మాట్లాడలేదని అన్న కిరణ్ కుమార్, అదంతా వాళ్ళ భ్రమని, రోజూ తనని చూస్తుండటం వలన కలిగిన చిత్త భ్రాంతితో వాళ్ళకి అలా కనిపించి ఉండవచ్చని అన్నారు.  

దీని మీద పదిమంది శిల్పకారులతో ఒక కమిటీని నియమించి నిజానిజాలను బయటకు తీస్తామని ముఖ్యమంత్రి వాళ్ళకి వాగ్దానం చేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles