Dhoom movie style thief in hyderabad

dhoom movie style thief in Hyderabad, Tanishq jewelry shop, Robbery in Tanishq jewelry shop, Tanishqu Panjagutta shop

dhoom movie style thief in Hyderabad

హైధ్రాబాద్ లో ధూమ్ 4- తనిష్క్ చోరీ

Posted: 01/27/2014 12:25 PM IST
Dhoom movie style thief in hyderabad

సంచలనాన్ని సృష్టించటం కోసమే కానీ దొంగతనం తన వృత్తి కాని ధూమ్ సినిమాలోని ప్రధాన నేరస్తుడు గుర్తుకొచ్చే విధంగా ఉంది తనిష్క్ నగల దుకాణంలో జరిగిన చోరీ.   కమల హాసన్ చిత్రం భారతీయుడు కూడా అతనికి స్పూర్తినిచ్చినదేనట.

తనిష్క్ నగల దుకాణంలో 23 కోట్ల రూపాయల విలువైన 30 కిలోల నగల చోరీ జరిగింది.  2006 మే లోకూడా పంజాగుట్ట నగల దుకాణం జోయ్ అలుక్కాస్ లో చోరీ జరిగింది.  చోరీ చేసిన బృందం ముంబైలో ఆ తర్వాత పట్టుబడింది.  ఇది కూడా అలా ఒక దొంగల ముఠా పనేనని పోలీసులు ముందు భావించారు.   అయితే సిసి కేమెరాలలో ఒకే వ్యక్తి లోపలికి ప్రవేశించి సేఫ్ లను తెరిచి నగలు తీసుకెళ్ళినట్టుగా చిత్రీకరించబడింది. 

అయితే తనిష్క్ నగల దుకాణంలో జరిగిన దొంగతనం సంచలనం రేపటానికి కారణం, ఆ నేరస్తుడే స్వయంగా పోలీసులకు దొరికిపోయి తానే ఆ దొంగతనం చేసానని అంగీకరించటం, దరిమిలా మీడియా ముందు తను ఆ పని ఎందుకు ఎలా చేసింది వివరించటం. 

పంజాగుట్టలోని తనిష్క్ నగల దుకాణాన్నే లక్ష్యం చేసుకున్న కిరణ్ కుమార్ అనే వ్యక్తి కుందన్ బాగ్ లో స్విమ్మింగ్ పూల్ లో పనిచేసే వాడు.  దానివలన అతనికి స్థానికంగా ఉన్న దుకాణాల గురించి, అందులో ఉండే భద్రతా లోపాల గురించి తెలుసు.  అంతే కాకుండా అతను పెయింటర్ గా పనిచేయటం వలన ఎటువంటి గోడలకు ఎటువంటి ఫినిషింగ్ ఉంటుందో బాగా తెలిసినవాడు.  ఇవి అతని అర్హతలు. 

దొంగతనం సునాయాసంగా చెయ్యటం కోసం అతను చేసిన పని- గోడకి రంధ్రం చెయ్యటం.  సుత్తి, స్క్రూ డ్రైవర్ పనిముట్లుగా చేసి తనిష్క్ షోరూం వెనక చేసిన రంధ్రాన్ని ఎవరూ గమనించకపోవటానికి కారణం చుట్టుపక్కల ఐఏఎస్ అధికారుల నివాసాలుండటం, ఎవరీ దృష్టీ దానిమీద పడకపోవటం. 

ఇక అతని ఉద్దేశ్యం చూస్తే, దొంగతనం చేసి తస్కరించిన సొమ్ముతో దర్జాగా బ్రతుకుదామనుకున్నట్లయితే అతనంతగా అతను పోలీసుల ముందుకి వచ్చుండేవాడు కాదు. 

కిరణ్ కుమార్ మీడియా ముందు చెప్పినదాని ప్రకారం, అతను రాజకీయ నాయకుల అవినీతి, తన ఆర్ధిక సమస్యలు అతను చేసిన దొంగతనానికి కారణాలు.  పేద కుటుంబంలో జన్మించిన కిరణ్ కుమార్ డిగ్రీ ఎలాగో పూర్తి చేసినా అతనికి తగ్గ ఉద్యోగం లభించలేదు.  తండ్రి కూడా చనిపోవటంతో కుటుంబ భారమంతా అతనిమీద పడింది.  మనస్తాపంతో ముందు నక్సలైట్లలో చేరదామా అని అనుకున్నాడట.  భారతీయుడు సినిమాలో కమల హాసన్ చేసిన విధంగా దేశంలో అవినీతి అంతమొందిద్దామా అనే ఆలోచన కూడా వచ్చిందట.  కానీ కేవలం సంచలనాన్ని సృష్టించటం కోసమే తనిష్క్ లో దొంగతనం చేసి తనంతట తానుగా పట్టుబడ్డానన్నాడు కిరణ్ కుమార్. 

రసూల్ పుర లా కిరణ్ కుమార్ తస్కరించి దాచిన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles