Small step of up cm in a bigger perspective

small step of UP CM in a bigger perspective, Lethargy in Govt offices, Akhilesh Yadav, UP CM Akhilesh Yadav, Telugu Desam Chandra Babu Naidu, Lethargy in Government offices,

small step of UP CM in a bigger perspective

లంచ్ టైం ఎక్కువ తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగల సస్పెన్షన్

Posted: 01/28/2014 11:04 AM IST
Small step of up cm in a bigger perspective

హాజరీ అనేది కేవలం రికార్డ్ లో ఉండటం కాదు ప్రభుత్వోద్యోగులు పనివేళల్లో తమ సీటులో ఉండటం, పూర్తి సమయంలో పనిచెయ్యటం తప్పని సరి.  వాళ్ళు జీతాలు తీసుకుంటున్నదే దానికోసం. 

ప్రభుత్వోద్యోగుల జీతాలు, ఇతర సదుపాయాలు వాళ్ళకి లభిస్తున్నవి ప్రజలంతా కలిసి కడుతున్న వివిధ రకాల పన్నుల వలనే.  వాళ్ళు చెయ్యవలసింది ప్రజాసేవే- అది కూడా పని వేళల్లో వాళ్లు చెయ్యగలిగిన కార్యాలయాల్లో కూర్చుని చెయ్యగలిగిన పనులే. 

అయితే ఎన్ని శలవులున్నా, కార్యాలయాల్లో హాజరీ వేసుకుని సొంత పనులు చేసుకునేవాళ్ళని మనం చూస్తునేవుంటాం.  అలా చేస్తున్నవాళ్ళంతా ప్రజలను మోసం చేస్తున్నట్టే.  దాని వలన దేశంలో ఉత్పాదనను తగ్గిపోతుంది.  తమ పనులు వదులుకుని, అందుకు ఆర్థికంగా వచ్చే నష్టాన్ని కూడా భరిస్తూ ఎంతో అవసరంలో ప్రభుత్వ కార్యాలయాలకు పోయేవాళ్ళని పట్టించుకోకుండా నిదానంగా పనులు చేస్తూ, సాధ్యమైనంత వరకు నియమాల ముసుగులో జాప్యం చెయ్యటం కాని, ఇతరుల మీదకు నెట్టివేయటం చేస్తుంటారు.  వచ్చిన వాళ్ళ పనులు తెమల్చకుండా తిప్పుకుంటుంటారు.  అలా ఎంత జాప్యం చేస్తే అంత ప్రయోజనం కూడా ఉండే అవకాశం ఉంది.  తొందరలో ఉన్నవాళ్ళు లంచాలు ఇచ్చైనా పనిచేయించుకోవాలనుకోవచ్చు.  ఆఫీసుల చుట్టూ తిరిగే సమయంలో వాళ్ళు పోగొట్టుకుంటున్న ఆదాయంలో చూసుకుంటే ఇచ్చే లంచాలు చిన్నవే అని వాళ్ళకి అనిపించవచ్చు.  ఇవన్నీ అవినీతికి దారితీసే సందర్భాలు. 

ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసేవాళ్ళు పని చెయ్యకపోతే ఒక్కరోజైనా మనగలరా?  అందుకు కారణం ప్రైవేట్ సంస్థలలో నిరంతరం ఉండే జవాబుదారీ తనం.  ఎన్నో ప్రభుత్వ కార్యాలయాల్లో అందరూ పిచ్చాపాటీ మాట్లాడుకోవటం తరచుగా కనిపించే దృశ్యం. 

ఇలాంటివాటన్నిటికీ చెక్ పెడుతూ అఖిలేష్ యాదవ్ అటువంటి ప్రభుత్వోద్యోగులను సస్పెండ్ చేస్తాం జాగ్రత్తంటూ హెచ్చరించారు.  అంతేకాదు ఎక్కడెక్కడ ఆఫీసు వేళలను వృధా చెయ్యటం కానీ ఆ సమయాల్లో సీట్లలో లేకపోవటం కానీ లేదా లంచ్ మరి ఇతర విరామ సమయాలను ఇచ్చినదానికంటే ఎక్కువగా తీసుకోవటం కానీ చేస్తున్నారో వాళ్ళమీద ఫిర్యాదులు చెయ్యమని కోరారు.  మీడియాను కూడా అటువంటి వాళ్ళ మీద కన్ను వేసి వాళ్ళను బయటకు లాగమని కోరారు అఖిలేష్.  లంచ్ టైం ఉన్నది భోజనం చెయ్యటానికి కాని ఇంటికి పోవటానికి కాదు.  అలా ఇంటికి పోయినవాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని లోగడ ఉత్తర ప్రదేశ్ మంత్రి శివపాల్ యాదవ్ కూడా హెచ్చరించారు. 

ఇలాంటి పనులు చేసేటప్పుడు నియంతృత్వ ధోరణిలో చేస్తున్నారనే ఆరోపణలు రావటం సహజం.  కానీ పూర్తి ధైర్యసాహసాలతో సరైన వ్యూహ రచనతో ముందుకు సాగుతూ ఒక్కసారే పెనుమార్పు ఆశించకుండా కొద్దికొద్దిగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ విదేశాలలోని ప్రభుత్వ కార్యాలయాల్లో లాగా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేసే విధంగా మార్పులను తీసుకుని రావటం కోసం అఖిలేష్ యాదవ్ లా చిన్న అడుగుతో మొదలుపెట్టటం చాలా మంచిది.  ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయిన అలసత్వం ఒక్కసారిగా మారదు, దానితో వ్యతిరేకతలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి చిన్న చిన్న అడుగులే అందరి దృష్టిలోనూ శ్రేయస్కరం. 

ఆ తర్వాత ఒక్కసారి కలుగజేసుకుని వదిలెయ్యటం కాకుండా నిరంతరం కృషి చేసి నియమాలలో మార్పులు తీసుకునివస్తూ ఎప్పిటికప్పడు సరిచేస్తూ ఫలితాలను సరిచూసుకుంటూ వస్తే మన దేశం కూడా పని విషయంలో మార్పులు సంతరించుకుని ఉత్పాదకతను పెంచుకునే అవకాశం పూర్తిగా ఉంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles