వైవాహిక జీవితంలో ఉన్నంతకాలం భార్యాభర్తలిద్దరూ పరస్పర ప్రేమాభిమానాలను పంచుకుంటూ ఉంటారు. విడిపోయే సమయం వచ్చేసరికి ఆ ప్రేమ కాస్తా ద్వేషంలోకి మారుతుంది. విడాకులు తీసుకునేటప్పుడు భారతదేశంలో అయితే అభద్రతా భావమే కావొచ్చు లేదా నా జీవితంలో కొంత భాగం వృధా అయింది, అది ఇక తిరిగి రాదు అనే భావనే కావొచ్చు కానీ మహిళల తరఫు నుంచి వీలయినంత ఎక్కువగా భర్తల నుంచి విడాకులతో పాటు కోరుతుంటారు.
ఇది విదేశాలలో కూడా తక్కువేం కాదు అని లండన్ వాసి సమంతా లాంబ్ చేస్తున్న డిమాండ్ తో తెలుస్తోంది. 41 సంవత్సరాల సమంతా లాంబ్ 2009 తన భర్తకు కిడ్నీ దానం చేసింది. కిడ్నీ సమస్యతో కేవలం డయాలిసిస్ మీదనే బ్రతుకు సాగిస్తున్న ఆమె భర్త ఆండీ లాంబ్ కి ఆమె ఒక కిడ్నీ దానం చెయ్యటంతో అతను సాధారణ జీవితాన్ని కొనసాగించగలిగాడు. అప్పట్లో వీరి ప్రేమానురాగాలు, త్యాగాతిశయాల గురించి బిబిసిలో ఇంటర్వూ కూడా ఘనంగా వచ్చింది.
కానీ ఇద్దరూ విడాకులకు వచ్చేసరికి పరిస్తితంతా మారిపోయింది. ప్రేమ స్థానంలో వైషమ్యం చిగురించింది. 2012 లో ఆండీ ఆమెను వదిలేసాడు. కారణం తన స్నేహితురాలితో సంబంధం పెట్టుకున్నాడని ఆయన భార్య గొడవ. అదేమీ లేదంటాడు ఆండీ. అయినా నమ్మకం లేదంటూ సమంతా తన భర్త పూర్వ సంబంధంలో పిల్లలు కూడా ఉన్నారని, మళ్ళీ ఆమెకే చేరువౌదామని చూస్తున్నాడంటూ ఆరోపించారు.
దానం చెయ్యటమంటే నిజానికి దాని మీద అధికారాన్ని వదులుకోవటమే కానీ పట్టుదల వచ్చినప్పుడదంతా పోతుంది. నా వస్తువులన్నీ నాకిచ్చేయ్ అన్నట్లుగా నా కిడ్నీ తిరిగి నాకిచ్చేయమంటోందా విడిపోయన భార్య. మళ్ళీ ఆపరేషన్ చేసి ఆ కిడ్నీని తీసేస్తే అంతకంటే యోగ్యులకు ఆ కిడ్నీని ఇస్తానంటోందామె.
నిజానికి వాళ్ళిద్దరూ 2004 ఆంబులెన్స్ డ్రైవర్లుగా పనిచేస్తున్నప్పటి నుంచి వారి మధ్య ప్రేమ చిగురించటం, తర్వాత డేటింగ్ లు, కొంత కాలం కలిసివున్న తర్వాత 2007 లో వివాహబంధంలో ఒకరికొకరు ముడివేసుకోవటం జరిగింది. అంత ప్రేమ ఒక్కసారిగా తరిగిపోవటమే కాకుండా దాని స్థానంలో శత్రుత్వం చోటుచేసుకోవటం జరిగింది. సమంత చెప్పేదంతా తప్పు. ఆమె స్నేహితురాలితో నాకు ఎలాంటి సంబంధమూ లేదు. కేవలం ఆమె పెంపుడు కుక్క విషయంలో ఆమెకు నేను సాయపడ్డానంతే అంటాడు ఆండ్రీ లాంబ్.
కిడ్నీ అంటే ఇంకా అక్కడే ఉంది కాబట్టి ఆమె అడుగుతోంది కానీ, పంచుకున్న ప్రేమలు తిరిగి తీసుకోగలరా? తరిగిపోయిన వయసుని దక్కించుకోగలరా? ప్రేమ కలగటం జరిగినట్లే తగ్గిపోవటం కూడా జరగవచ్చు. అలాంటప్పుడు కూడా కలిసి వుండాలి అని చెప్పటం సమంజసం కాదు కాబట్టి ఇప్పుడు మన దేశంలో కూడా విడాకులు తీసుకునే సందర్బాలు ఎక్కువయ్యాయి. కానీ ప్రేమ స్థానంలో విషమయం కాకూడదు! ప్రేమ లేకపోయినా పరవాలేదు కానీ మనుషుల మధ్య వైషమ్యాలు తలెత్తకూడదని ఒప్పుకుంటారా?
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more