Cm asks 3 more weeks time on t bill debate

CM asks 3 more weeks time on T Bill debate, State reorganization bill, Telangana bill, Chief Minister Kiran Kumar Reddy, President Pranab Mukherjee

Chief Minister asks President for 3 more weeks time on T Bill debate

బిల్లు చర్చకు మరో 3 వారాల గడువు కోరిన కిరణ్ కుమార్ రెడ్డి

Posted: 01/28/2014 06:06 PM IST
Cm asks 3 more weeks time on t bill debate

రాష్ట్ర పునర్విభజన బిల్లు మీద చర్చకు రాష్ట్రపతిని మరో మూడు వారాల గడువు కోరారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.  సభలో ఇంకా 36 మంది సభ్యులు మాట్లాడవలసింది మిగిలివుంది కాబట్టి అందుకు మరో మూడు వారాలు పట్టవచ్చునని, అందువలన గడువు ఇవ్వవలసిందిగా రాష్ట్రపతిని కోరుతూ లేఖ రాసారాయన.

తన వ్యాఖ్యలకు వివరణనిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి, బిల్లు అసలుదా నకిలీదా అనే మాటలు తను అనలేదని అన్నారు.  బిల్లు సమగ్రంగా లేదని, పార్లమెంటులో ప్రవేశపెట్టే విధంగా సంపూర్ణరూపంలో రాలేదని, అటువంటి బిల్లు వస్తే చర్చలకు బాగుంటుందని తాను అన్నానని ఆయన వివరణనిచ్చారు. 

జనవరి 23న శాసన సభలో చర్చలు ముగించి రాష్ట్రపతికి తిరిగి పంపించవలసిన రాష్ట్ర పునర్విభజన బిల్లుకి గతంలో ముఖ్యమంత్రి నాలుగు వారాల గడువు కోరగా హోం శాఖ సిపారసుని అనుసరించి రాష్ట్రపతి ఒక్క వారం రోజుల గడువు మాత్రమే ఇచ్చారు. అది రేపటితో పూర్తై పోతుంది కాబట్టి ముఖ్యమంత్రి మరో మూడు వారాల గడువు కావాలని కోరటం జరిగింది. 

అయితే ఒకవేళ గడువంటూ ఇస్తే మరోసారి మరొక్క వారం రోజుల గడువునిస్తూ అదే ఆఖరని కూడా రాష్ట్రపతి స్పష్టంగా చెప్పే అవకాశం ఉందని విశ్వాసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles