Petition on ban on gay sex rejected by supreme court

Petition on ban on gay sex rejected by Supreme Court, Article 377 banning carnal sex, Gay sex attracts 10 years imprisonment, Delhi High Court lifting article 377

Petition on ban on gay sex rejected by Supreme Court, Article 377 banning carnal sex

స్వలింగులకు కేంద్రం సమర్ధన, సుప్రీం తిరస్కరణ

Posted: 01/28/2014 05:00 PM IST
Petition on ban on gay sex rejected by supreme court

స్వలింగ సంపర్కం చట్టరీత్యా నేరమన్న సుప్రీం కోర్టు తీర్పు మీద పునర్విచారణ చెయ్యమని కోరిన కేంద్ర ప్రభుత్వం పిటిషన్ తో పాటు స్వలింగ సంపర్క కార్యకర్తల పిటిషన్ ను కూడా సుప్రీం కోర్టు తిరస్కరించింది.

2009 లో ఢిల్లీ హైకోర్టు 1860 సంవత్సరం నాటి బ్రిటిష్ కాలంలో బహిష్కరించిన ఆడ. మగ లేక జంతువులతో కానీ ప్రకృతి విరుద్ధమైన సంపర్కాన్ని పునరుద్ధరించటం జరిగింది.  దానితో పాటుగా పరస్పర ఆమోదంతో జరిపే శృంగారానికి కూడా ఆమోదం తెలియజేసింది. 

2013 డిసెంబర్ 11 న సుప్రీం కోర్టు, ఇది ఆర్టికిల్ 377 కి చెందిన స్వలింగ సంపర్కం మీద తీర్పు కనుక, దాన్ని తిరగరాసే అధికారం కోర్టుకి లేదని, స్వలింగ సంపర్కం చట్ట రీత్యా నేరమే అవుతుందని, అందుకు శిక్ష 10 సంవత్సరాల వరకూ ఉండవచ్చని  తీర్పునిచ్చింది.  ఆరోజుని స్వలింగ బృందాలు, వారి సేవా సంస్థలు బ్లాక్ డే గా పరిగణిస్తున్నాయంటూ ఎలుగెత్తాయి.  ఏఐసిసి ఛైర్ పర్సన్ సోనియా గాంధీ కూడా సుప్రీం కోర్టు తీర్పుతో నిరుత్సాహపడ్డానని అన్నారు.

సుప్రీం కోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉంది.  ఇది పార్లమెంటు పరిధిలోకి వస్తుంది కానీ న్యాయస్థాన పరిధిలోకి రాదని తెలియజేయటం జరిగింది.  ప్రత్యామ్నాయంగా పార్లమెంటులో బిల్లు ద్వారా ఆర్టికిల్ 377 కి సవరణలు చెయ్యవచ్చని కూడా సూచించటం జరిగింది.  చట్ట సభలు చట్టాలను చేస్తే వాటికి అనుగుణంగా విచారణ చేసి తీర్పునివ్వటం న్యాయస్థానాలు చేస్తాయి, తీర్పుకి అనుగుణంగా చట్టాన్ని పరిరక్షించటం, తీర్పుని అమలుపరచటం పోలీసు శాఖ చేస్తుంది కాబట్టి దాన్ని సవరించే అధికారం హైకోర్టు కి కానీ మరే కోర్టు కి కానీ లేదన్నది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు. 

దీనిమీద మళ్ళీ పిటిషన్ వేసి పునపరిశీలన చెయ్యమని కోరేబదులు కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే చట్ట సభల ద్వారానే దానిలో సవరణలు తేవచ్చు.  కానీ పార్టీ దృష్ట్యా నిరసనలు తెలియజేసి ఓటు బ్యాంక్ ని పటిష్టం చేసుకోవలనుకుంటే మాత్రం ఇదే మార్గం.  సుప్రీం కోర్టు తీర్పుని తప్పు పట్టటమే.  ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా హైకోర్టు తీర్పుకే మద్దతు తెలియజేస్తూ సుప్రీం కోర్టు పునపరిశీలన చెయ్యాలనే కోరారు. 

కానీ ఈవిషయంలో సుప్రీం కోర్టు తీర్పు చాల స్పష్టంగా ఉండటం వలన పునపరిశీలన చెయ్యమనే పిటిషన్ ని తిరస్కరించటం జరిగింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles