Extra fare of apsrtc during festive season

extra fare of APSRTC during festive season, AP High Court disapproves RTC hike, RTC hikes charges during festive season, APRTC excessive delegation

extra fare of APSRTC during festive season, High Court Division Bench finds fault

పండుగ పేరుతో ఆర్టీసీ దోపిడి తగదు- హైకోర్టు

Posted: 02/04/2014 02:49 PM IST
Extra fare of apsrtc during festive season

పండుగ రోజుల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక సేవలందిస్తున్నామంటూ ప్రకటించే ఆర్ టి సి ఆ రోజుల్లో టికెట్ రేట్లను అమాంతం పెంచేస్తోంది.  దాదాపు రెట్టింపు ఛార్జీలను వసూలు చేస్తున్న ఆర్ టి సి మీద విశ్వ హిందూ పరిషత్ కి చెందిన రామ రాజు వేసిన పిటిషన్ మీద స్పందిస్తూ ప్రదాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, న్యాయమూర్తి పి వి సంజయ్ కుమార్ లో డివిజన్ బెంచ్ ఎపిఎస్ఆర్ టి సి ఆ విధంగా అదనపు సొమ్ముని వసూలు చెయ్యటాన్ని తప్పుపట్టింది.  అలా ఎక్కువ రుసుముని వసూలు చేసే అధికారం లేదని అన్న పిటిషనర్ మాటలతో హైకోర్టు ఏకీభవించింది.

జాతరలాంటి ప్రత్యేక సందర్భాల్లో టికెట్ రేటులో సగం వరకు అదనంగా ఛార్జ్ చెయ్యవచ్చని రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ కి వెసులుబాటు కలిగించినమాట వాస్తవమే కానీ ప్రభుత్వం ఆ ప్రత్యేక సందర్భమంటే ఏమిటో వివరంగా చెప్పలేదని, అలాంటప్పుడు ప్రత్యేక సందర్భాలకు తమ ఇష్టమొచ్చిన అర్థాన్ని ఆపాదించే హక్కు కార్పొరేషన్ కి లేదని డివిజన్ బెంచ్ తెలియజేస్తూ కార్పొరేషన్ నుంచి వివరణను కోరింది. 

ప్రత్యేక సందర్భమనేదానికి స్పష్టత లేనప్పడు దానికి అనుకూలమైన అర్థాన్నిచ్చుకుంటూ టికెట్ ధరను పెంచేయటం అంటే కార్పొరేషన్ తనకిచ్చిన అధికారాలకు మించి నడవటమే అవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది.

రద్దీగా ఉన్న సమయాల్లో,  రాత్రి సమయాల్లో, వర్షం పడుతున్నప్పుడు, బంధ్ రోజుల్లో ఆటో నడిపేవాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారని నానా విధాలుగా ఆక్షేపణలు తెలియజేస్తారు.  కార్పొరేషనైతే చెయ్యవచ్చా.  పండుగ రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉందంటే ఆర్ టి సికి ఎక్కువ లాభాలను పొందే అవకాశం లభించినట్లే.  అలాంటప్పుడు ఎక్కువ ఛార్జ్ చెయ్యటమనేది సమంజసం ఎలా అవుతుంది, అది ప్రయాణీకుల పట్ల సేవ ఎలా అవుతుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles