Electronic chips in petrol pumps to deceive customers

Electronic chips in petrol pumps, Petrol pumps deceived customers, SOT special officer, Cyberabad police raid petrol pumps, Short deliveries at petrol pumps

electronic chips in petrol pumps to deceive customers

పది పెట్రోల్ పంపులు, 20 కోట్ల వరకు దగా !

Posted: 02/04/2014 03:24 PM IST
Electronic chips in petrol pumps to deceive customers

డిజిటల్ మీటర్లుంటే మోసం చెయ్యటానికి కుదరదన్నది అమాయకత్వమని ఆటోమీటర్లలో ఎప్పుడో నిరూపించారు మన ఎలక్ట్రానిక్ రంగంలోని విశేషజ్ఞులు.  అయినా ఎలక్ట్రిటీసిటీ మీటర్లు, వాటర్ మీటర్లు, పెట్రోల్ పంపులో మీటర్లను డిజిటలే చేసేసారు దానివలనేదో మోసాలు అరికట్టవచ్చని. 

అయితే మోసాలు చేసేవారికి ఏదీ అడ్డు కాదని ఈమధ్యకాలంలో సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన దాడులలో తేలిపోయింది.  ఏకంగా 10 పెట్రోల్ పంపులలో మోసం జరుగుతోంది.  అదీ కనీసం ఒక సంవత్సర కాలంగా.  అందులో ఆ పెట్రోల్ పంపులు 20 కోట్ల అదనపు అవినీతి ఆదాయాన్ని పొందాయి. 

ఇదంతా చేసింది ఒక ఐదుగురు సభ్యులున్న బృందం.  వాళ్ళు ఎలక్ట్రానిక్ చిప్ ద్వారా మీటర్లో ఎక్కువ చూపించటానికి ఏర్పాట్లు చెయ్యగలిగారు.  దాన్ని పెట్రోల్ పంపులకు లక్షలలో అమ్మి, మీకు కావలసినంత సొమ్ము మీరు చేసుకోండని అన్నారు.  ఇదేదో బాగుందే అనుకుని కొన్ని పెట్రోల్ పంపులు ఆ అడ్డదారి ఆదాయానికి సై అన్నాయి.  దాడిలో దొరికినవి 10 పెట్రోల్ పంపులు.  ఇంకా ఎన్ని పెట్రోల్ పంపులు మోసం చేసాయో తెలియదు.  విషయం తెలుసుకుని చిప్ ని తీసేసినవారిని పట్టుకోవటం ఎవరితరమూ కాదు.  రాష్ట్రంలో 100 పెట్రోల్ పంపులకు ఈ చిప్ ని అమర్చామని చెప్పిందా ఐదుగురు సభ్యుల ముఠా.

ఈ పెట్రోల్ పంపుల్లో రోజుకి కనీసం 1000 లీటర్లు పెట్రోల్, 1000 లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుంటాయి.  అందులో 40 లీటర్ల వరకు ఆదా చేసుకున్నా రోజుకి రూ.200 రూపాయలు పెట్రోల్ ద్వారా, రూ.2400 డీజిల్ ద్వారా జేబులో వేసుకోవచ్చు.  అంటే రూ.5600 రోజుకి దండుకున్న దొంగ సొమ్ముతో ఒక నెలలోనే చిప్ కి ఇచ్చిన డబ్బులు వసూలైపోతాయి. 

ఈ విధంగా ఒక్కో పెట్రోల్ బంక్ రెండు కోట్ల వరకు మోసం చేసి సంపాదించిందని అంచనా వేసి చెప్పారు ఎస్ఓటి స్పెషల్ డ్యూటీ అధికారి కె.గోవర్ధన రెడ్డి. 

పట్టుబడ్డ పెట్రోల్ పంపులు ఇవి-

గుప్తా- కూకట్ పల్లి, మియాపూర్-మియాపూర్, వైష్ణోదేవి-బచ్చుపల్లి, గోయల్-మేడ్చల్, సాయి సిద్ది, రామచంద్రాపురం, మౌలా-బద్వేల్, లిఖిత్-తుక్కుగూడ, దారబోయిన-నాగోల్, సుమీత్-మొయినాబాద్, జయభేరి-పెట్బషీరాబాద్,   వీళ్ళు భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ డీలర్లు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles