Police encounter concrete walls in anuhya murder case

police encounter concrete walls in Anuhya murder case, Anuhya Esther murder, Mumbai Police failure in Anuhya case, No clues in Anuhya Esther case

police encounter concrete walls in Anuhya murder case

అనూహ్య కేసులో ఎదురౌతున్న సిమెంటు గోడలు

Posted: 02/11/2014 03:35 PM IST
Police encounter concrete walls in anuhya murder case

ఇంతవరకు 400 మందిని ప్రశ్నించిన ముంబై పోలీసులు అనూహ్య హత్య కేసులో అంగుళం కూడా ముందుకు కదలలేకపోయారు. 

ఎటువంటి కేసునైనా ఛేదించే పేరు గడించిన ముంబై పోలీసులు ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నానికి చెందిన అనూహ్య ఏస్తర్ హత్య కేసులో పూర్తిగా విఫలమయ్యారు.  ఎటువైపు తిరిగినా ముందుకు అడుగు పడకుండా వాళ్ళకి ఎదురుగా సిమెంట్ గోడ ఎదురొస్తోంది. 

అత్యాచారానికి గురైనట్లుగా కూడా పోస్ట్ మార్టం, డిఎన్ ఏ టెస్ట్ లలో తేలలేదని, ఇది అప్పటికప్పుడు జరిగిన సంఘటనే కాని ముందుగా అనుకుని చేసింది కాదని పోలీసులు భావిస్తున్నారు.  అనూహ్య ఉపయోగించే ల్యాప్ టాప్ కానీ ప్రయాణంలో ఆమెతో ఉన్న ఆమె బ్యాగ్ కానీ పోలీసులకు లభించలేదు. 

నెలరోజుల నుంచి దర్యాప్తు చేస్తున్నా ఎక్కడి నుండి ఎటువంటి సమాచారమూ లేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.  ఆమెతోపాటు పనిచేసే సహోద్యోగులు, ఆమె సన్నిహితులు ఇలా ఎవరిని ప్రశ్నించినా ఫలితం శూన్యమే అవుతోంది. 

ఈ చేస్తున్న కృషి, దర్యాప్తులో వేగం ఆ సమయంలోనే ఉంటే ఏమైనా తెలిసే అవకాశం ఉండేదేమో కానీ ఇప్పటికే నెల దాటిపోయిన సంఘటనలో కాలదోషం పట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ దారి తెన్నూ ఎక్కడా కనిపించటం లేదు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles