Mom completes 100 days space travel

MOM completes 100 days space travel, Mars Orbiter Mission, Mangalyaan from ISRO, Indian Space Research Organization, ISRO Sriharikota

MOM completes 100 days space travel, Mars Orbiter Mission, Mangalyaan from ISRO

100 రోజులు పూర్తి చేసుకున్న మామ్

Posted: 02/12/2014 07:49 AM IST
Mom completes 100 days space travel

మార్స్ ఆర్బిటరీ మిషన్ (మామ్) తెలుగులో మంగళయాన్ ఈ రోజుతో రోదసీ లో 100 రోజుల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది.  అరుణ గ్రహం దిశగా ఇప్పటివరకు 190 మిలియన్ కిలో మీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న మామ్ రానున్న 210 రోజుల్లో మొత్తం 680 మిలియన్ల కిలోమీటర్ల దూరాన్ని అధిగమించవలసివుందని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తెలియజేసింది. 

నవంబర్ 5, 2013 న ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట నుండి లాంచ్ అయిన మంగళయాన్ ని కర్నాటక లోని బెంగళూరు నగర శివార్లలో ఉన్న బైలాలు లో ఉన్న ఇండియన్ స్పేస్ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ (ఇస్ట్రాక్) నుంచి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ, ఆదేశాలను పంపిస్తూ నియంత్రణ చేస్తున్నారు.  నిమిషానికోసారి స్పేస్ క్రాఫ్ట్ నుంచి గ్రౌండ్ స్టేషన్ కి మళ్ళీ వెనక్కి సంకేతాలు నిరంతరం పయనిస్తూనే ఉన్నాయి.  భూమి నుంచి 16 మిలియన్ల దూరంలో ఉన్న మామ్ నుండి భూమ్మీదకు సంకేతాలు రావటానికి ప్రస్తుతం 55 సెకండ్లు పడుతోంది.  మామ్ లాంచ్ అయిన దగ్గర్నుంచి ఈ 100 రోజుల్లో ఒకే ఒక్కసారి 40 నిమిషాల పాటు సంకేతాలు రాలేదు మిగిలిన సమయమంతా నిరంతరం సంకేతాలు అటూ ఇటూ నడుస్తూనేవున్నాయని ఇస్రో తెలియజేసింది. 

మొత్తం 300 రోజుల ప్రయాణంలో ఇప్పటికి మూడవ వంతు అయింది.  సెప్టెంబర్ మాసం మధ్యలో మంగళయాన్ తన లక్ష్యమైన అరుణ గ్రహానికి చేరుకుంటుంది.  సెప్టెంబర్ 24 న ఈ స్పేస్ క్రాఫ్ట్ మిషన్ మార్స్ ఆర్బిట్ ఇన్సర్షన్ లోకి పోతుంది.  అంటే అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. 

190 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణం చేసినా భూమికి 16 మిలియన్ల కిలోమీటర్ల దూరంలోనే ఉండటానికి కారణం మంగళయాన్ చక్కెర్లు కొడుతూ పోవటం వలన భూమి కక్ష్యలోంచి బయటకు వెళ్ళగలిగింది.  పైగా భూమి కూడా అదే దిశలో ప్రయాణం చేస్తుండటం వలన ప్రస్తుతం భూమి నుంచి సరళరేఖలో చూసుకుంటే 16 మిలియన్ల కిలోమీటర్ల దూరంలోనే ఉంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles