Valentines effigy burnt on valentine day

valentines effigy burnt on valentine day, Bhajarang dal, Viswa Hindu Parishat, VHP burns lovers effigy, VHP warns lovers going around

valentines effigy burnt on valentine day, Bhajarang dal, Viswa Hindu Parishat

ప్రేమికుల రోజున ప్రేమికుల దిష్టిబొమ్మ దగ్ధం

Posted: 02/14/2014 12:28 PM IST
Valentines effigy burnt on valentine day

ప్రేమికుల రోజును (వాలెంటైన్స్ డే) ని పాశ్చాత్య విష సంస్కృతిగా అభివర్ణిస్తూ దాన్ని పాటించటం మానెయ్యాలన హైద్రాబాద్ లో భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ నేతలు పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా కోఠి కూడలిలో ప్రేమికుల దిష్టి బొమ్మను దగ్ధం చేసారు. 

ఈ రోజున ప్రేమికుల రోజు విశేష కార్యక్రమాలు చేపట్టే హోటళ్ళను తెరవకుండా అడ్డుపెడతామని విహెచ్పి నేతలు హెచ్చరికలను జారీచేసారు.  బహిరంగ ప్రదేశాలు, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్ళ దగ్గర ప్రేమ జంటలు కనిపిస్తే వారి తల్లిదండ్రులతో సహా కార్యాలయానికి పలిపించి కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుందన్నారు. 

కానీ కొన్ని మేగజైన్లు చేసిన సర్వేలో బయటపడ్డ విషయాలు మారిపోతున్నదనుకున్న ఈ కాలంలో విచిత్రంగానే కనిపిస్తాయి.  అవి-

గుడ్డిగా ప్రేమకే పెద్దపీట వెయ్యము అని ఆడ మగ ఇద్దరూ చెప్పారు.  జీవితంలో ఎదగటం ప్రాధాన్యంగా చదువు ఉద్యోగాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తామన్నారు.  చేసుకోవటానికి వేడుకగా వాలెంటైన్స్ డే, ఫ్రెండ్ షిప్ డే లను చేసుకుంటాం కానీ జీవిత లక్ష్యాలను విస్మరించమని చెప్తున్నారు.  చూడగానే ప్రేమ పుట్టటం అనేదాన్ని అధికశాతం అంగీకరించటం లేదు.  అవన్నీ సినిమాల్లో బాగానేవుంటాయి కాని నిజజీవితంలో అనుకూలంగా కలిసిమెలిసి జీవితాన్ని సాగించటం ముఖ్యమని, ప్రేమ అనే పేరుతో పెద్దలను ఎదిరించి పెళ్ళిచేసుకోవటం జీవిత పరమార్ధం కాదనే అర్థం వచ్చేట్టుగా మాట్లాడినవాళ్ళే ఎక్కువమంది ఉన్నారు. 

ఇంకా, సర్వేలో ఆశ్చర్యకరంగా వెల్లడైన విషయాలు పెద్దవాళ్ళని కూడా విస్మయపరుస్తాయి.  పెళ్ళికి ముందు శృంగారానికి మొగ్గు చూపించనివాళ్ళే ఎక్కువమంది కనిపించారు.  కులాంతర మతాంతర విహాహాలు కూడా అంత అవసరమని వాళ్ళు అనుకోవటం లేదు.  సహజీవనానికి కూడా వాళ్ళు అంగీకారం చూపించలేదు.  మన దేశంలో ఇది మనకు సరిపడేది కాదని అన్నారు.  ఇంకా ప్రేమ విషయంలో భాగస్వామిలో అందం, చదువు, ఉద్యోగం చూడటం జరుగుతుంది కానీ, ఎక్కువగా కలిసిమెలిసి జీవించే వ్యవహార శైలితో కలుపుగోలుతనంతో సరదాగా ఉండేవాళ్ళంటేనే ఎక్కువ ప్రాధాన్యతనిస్తామంటున్నారు. 

అందువలన చెదురుమదురు కేసులుండవచ్చు కానీ స్థూలంగా యువత చెడిపోతోంది, పాశ్చాత్య విధానాలకు మోజు చూపించి సంస్కారాలకు తిలోదకాలిస్తోందని పెద్దలు వాపోవటం నిరాధారమని సర్వేలు చెప్తున్నాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles