Teen love for 50 years old woman

Teen love for 50 years old woman, Meerut police dilemma, love between boy 17 and woman 50, Minor loves mother of 8 children

Teen love for 50 years old woman, Meerut police dilemma

ప్రేమ కథలో పోలీసులకు వింత అనుభవం

Posted: 02/14/2014 01:54 PM IST
Teen love for 50 years old woman

ఢిల్లీకి సమీపంలో ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ పట్నంలో పోలీసులకు ఒక ప్రేమ వ్యవహారంలో ఎటు నచ్చచెప్పాలో తెలియని పరిస్థితి ఎదురైంది. 

ప్రేమించుకునేవాళ్ళకి అడ్డుచెప్పే బంధువులనుంచి రక్షించమని పోలీసులను ఆశ్రయించటం సామాన్యంగా జరుగుతూనేవుంటుంది, అటువంటి సందర్భాల్లో పోలీసులు ప్రేమికుల పక్షానే మాట్లాడి సర్ది పంపిస్తారు.  ఆడపిల్ల మైనర్ అని ఆమె టుంబ సభ్యులు వాదించే ప్రయత్నం కూడా చేస్తుంటారు.  అలాంటప్పుడు వాళ్ళ సర్టిఫికేట్లను పరిశీలించటం జరుగుతుంది.  దీనికోసం కోర్టు వరకు పోనక్కర్లేదు.  పోలీసు స్టేషన్ లోనే తగువు తీరిపోతుంది. 

కానీ మీరట్ పోలీసులకు ఈసారి వింత సమస్య ఎదురైంది.  ఇద్దరిలో అబ్బాయి 17 సంవత్సరాలవాడయితే ఆమె మాత్రం 8 మంది పిల్లలను కన్న 50 సంవత్సరాల మహిళ.  కానీ వాళ్ళ హృదయాలకు వయసులోని అంతరాలు లెక్కలోకి రావటం లేదు.  ఒకరిని వీడి మరొకరు జీవించలేనంతా ప్రేమలో పడ్డారు. 

ఈ తంతు ఆరు నెలలనుంచి జరుగుతుండగా అబ్బాయి తల్లిదండ్రులు అతన్ని ఢిల్లీలో స్కూల్లో చేర్పించారు.  కానీ దూరం వాళ్ళిద్దరి ప్రేమను తెంచలేకపోయింది.  విరహాన్ని తాళలేక ఇద్దరూ కలిసి జీవించటానికి నిశ్చయించుకున్నారు కానీ ఇటువైపు వారు అటువైపు వారు వాళ్ళిద్దరినీ బలవంతంగా విడదీయటానికి చూస్తున్నారు.  అందుకే వాళ్ళిద్దరూ పోలీసుల మద్దతుని కోరుతున్నారు.  ఇదీ అసలు విషయం పోలీసులకు ఎటూ తేల్చుకోలేకపోవటానికి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles