Rain at medaram jatara

Rain-at-medaram-jatara, Sammakka Sarakka Jatara, Sammakka Sarakka last day Jatara, Farewell to Sammakka Sarakka

rain-at-medaram-jatara, Sammakka Sarakka Jatara

మేడారం జాతరలో వర్షంతో ఇబ్బందులు

Posted: 02/15/2014 08:27 AM IST
Rain at medaram jatara

మేడారం జాతర ఈ రోజు చరమాంకాన్ని చేరుకోబోతున్న సందర్భంగా సమ్మక్క సారక్కల దర్శనం చేసుకోవటానికి భక్తులు తండోపతండాలుగా విచ్చేసారు.  ఈ రోజు ఉదయం జాతర జరుగుతున్న స్థలంలో వర్షం పడటంతో సందర్శకులు ఇబ్బందులు పడ్డారు.  అయినా పట్టువిడవకుండా వర్షాన్ని పట్టించుకోకుండా భక్తితో దేవతల దర్శనం చేసుకోవటానికి బారులు తీరారు. 

అయితే రవాణా సౌకర్యం సరిపోకుండా ఉండేటప్పటికి తిరుగు ప్రయాణం బస్సుల కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూ కట్టారు.  అన్ని చోట్ల నుండీ బస్సులు మేడారం రవాణా సేవలో ఉండటం వలన హైద్రాబాద్ నగరంలో కూడా బస్సుల కొరతతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. 

ఈ రోజు జాతర ఆఖరు రోజున సమ్మక్క సారక్క దేవతలను వనానికి పంపించటం జాతర పూర్తవుతుంది.  తిరిగి రెండు సంవత్సరాలకు మళ్ళీ వనం నుంచి తీసుకుని వస్తారు. 

భక్తితో కొలిచే చోట వాతావరణమంతా భక్తి ప్రకంపనలతో నిండివుండటం చేత సామాన్యంగా అక్కడ వర్షం పడటం చాలా సందర్భాలలో చూడవచ్చు.  నడి వేసవిలో శ్రీరామ నవమి ఉత్సవంలో సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత కొద్దిగా చినుకులైనా పడటం సామాన్యంగా చూడవచ్చు.  శివరాత్రికి శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జునులను కొలిచే భక్తుల పారవశ్యం వలన చాలా సందర్భాలలో వర్షం పడుతుంది.  అంతకు ముందు లేని చలి కూడ ఆరోజు ఉంటుంది.  యజ్ఞ యాగాదులు జరిగే చోట కూడా వర్షాలు పడటం సహజంగా చూస్తుంటాం.  అందుకే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, యజ్ఞయాగాదులు చెయ్యటం వలన ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుందని చెప్పేవారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles