Telangana appointment day orders in five days

Telangana appointment day orders, Telangana Rashtra Samithi, K Chandrasekhara Rao, Sonia Gandhi Telangana, Telangana separate State, Telangana Statehood

Telangana appointment day orders in five days

ఐదు రోజుల్లో తెలంగాణా అప్పాయింట్ మెంట్ డే

Posted: 02/19/2014 07:56 AM IST
Telangana appointment day orders in five days

ఐదు రోజుల్లో తెలంగాణా అప్పాయింట్ మెంట్ డే కి సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడుతాయని కెసిఆర్ అన్నారు.

ఇందులో గెలుపూ ఓటమిలు లేవు.  మనం మన లక్ష్యానికి చేరుకోబోతున్నాం.  దీన్ని ఒకరికి గెలుపు ఒకరికి ఓటమి అని భావించవద్దు.  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యవద్దు.  అంతా సంయమనం పాటించండి.  తెలంగాణా ఏర్పడ్డాక ఆంధ్రా ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని మనం మాటిచ్చాం.  దాన్ని నిలబెట్టుకుందామంటూ తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ తెలంగాణా మద్దతుదారులందరికీ పిలుపునిచ్చారు.  

తెలంగాణా జెఏసి, తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కెసిఆర్ కి అభినందనలు తెలియజేసారు.  ఈ సందర్భంగా కెసిఆర్ సోనియా గాంధీ తన మాట మీద నిలబడి చివరి వరకూ పట్టుదలతో తెలంగాణా బిల్లును గట్టెక్కిస్తున్నందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేయాలని అన్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీలో విలీనమా లేక పొత్తు పెట్టుకోవాలా అన్నది సోనియా గాంధీతో భేటీ అయిన తర్వాత నిర్ణయిస్తామని అన్నారు.  బుధవారం రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందుతుందని,  ఈ విషయంలో తొందరపాటు వద్దని, అన్నీ సమగ్రంగా ఆలోచించుకునే నిర్ణయం తీసుకోవాలని పార్టీ సభ్యులు తమ అభిప్రాయాన్ని తెలియజేసారు.  

25 వ తేదీన కెసిఆర్ హైద్రాబాద్ కి తిరిగివస్తున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతాన్ని ఏర్పాటు చేస్తున్నారు.  దానికి కనీసం లక్ష మంది హాజరవాలని, తెలంగాణా ఆవిర్భావానికి తెరాస కృషి కారణమన్న సంగతి ప్రజలలోకి బాగా నాటుకునేట్టుగా ప్రచారం జరగాలని కెసిఆర్ ఆదేశించారు.  కొనసాగింపుగా మార్చి మొదటి వారంలో భారీ ఏర్పాట్లతో కృతజ్ఞత సభను ఏర్పాటు చెయ్యాలనే ఆలోచనను కూడా కెసిఆర్ తెలియజేసారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles