Bandhs in seemandhra districts

Bandhs in Seemandhra districts, Telangana Bill passed in Loksabha, Seemandhra buses restricted to depots, Bandhs in seemandhra districts

Bandhs in Seemandhra districts

సీమాంధ్రలో బంద్ లు, ఉద్రిక్తతలు

Posted: 02/19/2014 08:26 AM IST
Bandhs in seemandhra districts

తెలంగాణా బిల్లు లోక్ సభలో ఆమోదం పొందటంతో సీమాంధ్రలో పలు ప్రాంతాల్లో బంద్ లు కొనసాగుతున్నాయి.  రెండు పై చిలుకు చేసిన సమ్మె, దీక్షలు, ఢిల్లీ లో నిరసనలు ఇవన్నీ వృధా అయిపోయ్యాయని, ఆ ఆందోళనలను ఢిల్లీ పెద్దలు కనీసం గుర్తించిన పాపాన పోలేదని ఆందోళనకారులు ఆవేదనను వెలిబుచ్చుతున్నారు.

అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ప్రధానమైన కూడళ్ళల్లో పూర్వానుభవం దృష్ట్యా అల్లర్లు రేగే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పోలీసు బలగాలు మోహరించివున్నారు. 

కడప, తూర్పు గోదావరి జిల్లా, చిత్తూరు, ఒంగోలు జిల్లాలలో ఆందోళనలు చెలరేగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.  తూర్పు గోదావరి జిల్లాలోని 9 డిపోలలోని 850 బస్సులు డిపోలకే పరిమితమైపోయాయి.  వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.  కడప జిల్లాలోని 8 డిపోలలో 900 బస్సులూ డిపోలకే పరిమితమైపోయాయి.  చిత్తూరు జిల్లాలో కూడా 13 డిపోలలోని 1400 బస్సులను డిపోలలో నిలిపివేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles