Jayaprada on women reservation bill

Jayaprada on women reservation bill, Jayaprada MP, Rampur MP Jayaprada, Women Reservation bill 2010, AP State Reorganization Bill 2013

Jayaprada on women reservation bill, Jayaprada MP

స్పీకర్ మీరా కుమార్ ని నిలదీసిన జయప్రద

Posted: 02/19/2014 03:15 PM IST
Jayaprada on women reservation bill

మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చకు ఎందుకు రావటం లేదు అని సినిమా నటి, రామ్ పూర్ నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్నఎంపీ జయప్రద ప్రశ్నించారు. 

తెలంగాణా బిల్లు మీద చూపించిన శ్రద్ధ, వాడి, వేడి, చొరవ, వేగం మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ఎందుకు చూపించదు కేంద్ర ప్రభుత్వమని లోక్ సభ ఎంపీ జయప్రద ప్రశ్నించారు.   ఆమె మాట్లాడుతుంటేనే ఇతర సభ్యులు గందరగోళం సృష్టించటంతో స్పీకర్ మీరా కుమార్ జయప్రద మాటలను పూర్తి చెయ్యనివ్వండని సభ్యులను కోరారు.

గందరగోళం మధ్య సభ రేపటికి వాయిదా పడింది.

మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభ 2010 లో మార్చి 9 న ఆమోదించి లోక్ సభకు పంపించింది.  కానీ లోక్ సభలో ఆ బిల్లు ఇంతవరకు వోటింగ్ కు నోచుకోలేదు. 

రాజ్యాంగంలో 108 వ సవరణగా మహిళా బిల్లులో మహిళలకు లోక్ సభలోను, రాష్ట్ర శాసన సభల్లోనూ 33 శాతం రిజర్వేషన్ చెయ్యటానికి మహిళా రిజర్వేషన్ బిల్లు రూపొందింది.  రాజకీయాల్లోను, సామాజికంగానూ మహిళలు భాగస్వామ్యం వహించటానికి దీనివలన సాధ్యమౌతుందని ఈ బిల్లు లక్ష్యం.  రిజర్వేషన్ వలన మహిళలకు రాజకీయాలలో భాగం వహించి దేశాన్ని నడిపించటానికి వీలు కలుగుతుందన్నది కూడా బిల్లు ఉద్దేశ్యమే.

కానీ రాజకీయంగా ప్రభుత్వానికి ప్రయోజనం కలిగిస్తాయనుకున్న బిల్లులను మాత్రమే ఉన్న తక్కువ సమయంలో చకచకా పాస్ చేయించుకోవలన్నది కేంద్ర యుపిఏ ప్రభుత్వం ఉద్దేశ్యమని జయప్రద ఆరోపణలో అవగతమౌతోంది.

అయితే ఈ విషయంలో ఈ నెల 15న సోనియా గాంధీ కూడా మహిళా బిల్లుని ఆమోదించకపోవటం దురదృష్టకరమని అన్నారు.  లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండటం వలన, మహిళా బిల్లు మీద సభ్యుల అంగీకారం కుదరకపోవటం వలన ఈ బిల్లు రాజ్యసభలో పాసైనా లోక్ సభలో ఆమోదాన్ని పొందకపోవటం పట్ల ఆమె విచారాన్ని వ్యక్తంచేసారు. 

కానీ, ఆమె తలచుకుంటే అంతటి ఆందోళనల మధ్య పాసైన తెలంగాణా బిల్లుతో పోలిస్తే, మహిళా రిజర్వేషన్ బిల్లుని పాస్ చేయించటం ఆమెకు కష్టమేమీ కాదని జయప్రద మాటలకు అర్థం. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles