Tamil nadu mps fight in rajya sabha

rajya sabha, telangana bill, tamil nadu mps, seemandhra leaders,tamil nadu mps fight in rajya sabha, tdp leader sujana chowdary, congress party, bjp, seemandhra mps.

tamil nadu mps fight in rajya sabha

రాజ్య సభలో తమిళ ఎంపీల గోల-సీమాంద్ర నేత నోటీస్

Posted: 02/20/2014 02:23 PM IST
Tamil nadu mps fight in rajya sabha

రాజ్యసభ లో   తెలంగాణ బిల్లు పై  సీమాంద్ర నేతలు  ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే   రాజ్య సభలో  మరో  సమస్యపై  తమిళనాడు  ఎంపిలు ఆందోళన చేస్తున్నారు.  తమిళ  జాలర్ల సమస్యలపై  రాజ్యసభ  అట్టుడుకింది.  జాలర్ల అంశంపై  చర్చించేందుకు ప్రధాని , విదేశాంగ మంత్రి సభకు  రావాలని  ఏఐడిఎంకే  సభ్యులు  పట్టుబడ్డారు.  రాజ్యసభ చైర్మన్  పోడియం  వద్దకు వెళ్లి  వారు నిరసన తెలపడంతో  సబలో  తీవ్ర గందరగోళం  నెలకొంది.    

రాజ్యసభ  అరగంట వాయిదా పడిన తరువాత   సభలో  సీమాంద్ర  ఎంపీలు  సేవ్  ఆంద్రప్రదేశ్ ప్లకార్డులు, నినాదాలతో  నిరసన   కొనసాగించారు.  కేంద్ర మంత్రి చిరంజీవి తన స్థానంలో నిలబడి నిరసన తెలిపారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలంటూ  ప్లకార్డుతో  గుండు సుధారాణి నిరసన తెలిపారు. 

టిడిపి  రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి  డిప్యూటీ చైర్మన్ కు నోటీసు ఇచ్చారు. 

 రాజ్యసభలో  విభజన  బిల్లును  అడ్డుకునేందుకు  సీమాంద్ర తెదేపా సభ్యులు  శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.  ఆంద్రప్రదేశ్  పునర్ వ్యవస్థీకరణ  బిల్లులో  రాజ్యాంగ, న్యాయపరమైన  ఇబ్బందులపై తలెత్తే  సందేహాలకు  సమాధానమివ్వడానికి  అటార్నీ  జనరల్ ను  సభకు  ఆహ్వానించాలని కోరుతూ  డిప్యూటీ చైర్మన్కు నోటీసు అందజేశారు. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles