Has telangana state became a realty

Has Telangana State became a realty, Telangana State hood, President rule, Telangana bill passed

Has Telangana State became a realty

ఇంతకి తెలంగాణ అచ్చిందా సారూ

Posted: 02/28/2014 04:02 PM IST
Has telangana state became a realty

"ఏం సారూ ఇంతకి తెలంగాణా అచ్చిందా?" ఆగలేక అడిగిందామె కాస్త చదువుకున్నవాడిలా కనిపిస్తూ టీ తాగుతూ షేర్ ఆటో కోసం ఎదురు చూస్తున్న మనిషిని. 

"అచ్చిందచ్చిందని మొన్నంతా ఆగమాగం జేసింరు.  అంతకుముందేమొ తెలంగాణ ఆపటం ఎవరి తరంగాదన్నరు.  ఇగో వచ్చేసిందని రంగులు పూసుకుని డేన్సులు చేసింరు.  ఇగ నా దగ్గర చాయిలు తాగింరు ఒక్కలు పైసలు గట్టలె.  సరే పోతెపొయింది.  కనీసరం ఇదైనా చెప్పుండి సారూ నా బిడ్డకు వుజ్జోగం వస్తదా? ఇప్పుడు ఇళ్ళలకి నీళ్ళస్తయా? కరెంటు పోకుంట ఉంటదా?  హైదరాబాద్ మనదైనట్లేనా?  మరియ్యాలేదో రాష్ట్రపతి పాలన అంటుంరు.  ఏంటిది సారూ గిదంతా?" అని అమాయకంగా అడిగిందామె. 

టీ తాగుతున్నతను ఉన్నట్టుండి జేబులోంచి ఫోన్ తీసి మాట్లాడటం మొదలుబెట్టాడు.  "ఆఁ ఆఁ వస్తన్న ఆటోకోసం చూస్తావున్నా"  అంటూ ఆటో వస్తుంటే రెండు అడుగులు అటేసి మళ్ళీ వెనక్కొచ్చి చేతిలో టీ గ్లాసు టీ అమ్మే దుకాణం బల్ల మీద పెట్టి గబగబా ఆ ఆటోలో కూర్చుని వెళ్ళిపోయాడు. 

'నువ్వుగూడా టీ డబ్బులియలే గద సారూ.  కనీసం నా ప్రశ్నకన్న జవాబియ్యాల్సింది' అందామె. 

ఆమె మనసులో మాట వినపడ్డట్టుగా వెనక్కి తిరిగి చూసిన అతను, 'నాకు తెలిస్తే చెప్పనా అమ్మా!' అన్నాడు మనసులోనే. 

ఆ మాట వినపడ్డట్టుగానే "సర్లే బిడ్డా సల్లగుండు!" అందామె.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles