Kiran kumar nnounces launch of new party

Former Chief Minister ,N. Kiran Kumar Reddy, Kiran announces new party, kiran party meeting in Rajahmundry, Jagan Mohan Reddy, kiran new party launch on march 12,Kiran Kumar reddy,new party,Telugu people

Former Chief Minister of Andhra Pradesh N. Kiran Kumar Reddy is all set to launch a new party. The new party policies will be announced at a public meeting at Rajahmundry.

నల్లారి వారి కొత్త పార్టీ ఈనెల 12 న

Posted: 03/06/2014 06:57 PM IST
Kiran kumar nnounces launch of new party

తెలంగాణ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామాను ఆమోదించిన తరువాత మాజీగా మారిన కిరణ్ కుమార్ రెడ్డి ఇన్ని రోజులు తన మద్దతు దారులతో సంప్రదింపులు జరిగిన ఆయన నేడు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించాడు. తెలుగు వారి ఆత్మ గౌరవమే పరిరక్షణే ఫార్టీ ఎజెండాగా ఈ పార్టీ ఉంటుందని చెప్పాడు. ఈ పార్టీకి సంబంధించిన వివరాలను, పార్టీ పేరును, భవిష్యత్తు విధి విధానాలను ఈనెల 12వ తేదీన రాజమండ్రిలో పెట్టే బహిరంగ సభలో వెల్లడిస్తామని చెప్పాడు.

రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో తెలుగు ఎంపీలను బహిష్కరించిన తీరు తెలుగు జాతికే అవమానమని, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు జాతిని సమైక్యంగా ఉంచడానికి నా సాయశక్తుల ప్రయత్నించానని, చంద్రబాబు రెండు కళ్ళ సిద్దాంతం పేరుతో, జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర విభజనకు ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదని, మీది మాటలకే జగన్ సమైక్య వాదని, లోపల మాత్రం విభజన వాదని ఆరోపించారు.

ఈ నెల 12వ తేది గురువారం సాయంత్రం 4 గంటలకు రాజమండ్రిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆ సభలో  పార్టీ పేరు, పార్టీ విధివిధానాలు, ఇతర అంశాలు ప్రకటిస్తామన్నారు. పదవుల కోసం కాదని, ప్రజల కోసం పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. మరి ఇప్పటికే చాలా మంది పార్టీలు పెట్టి జెండాలు పీకేసిన వారు ఉన్నారు. మరి వారిలా కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ కాదు కదా ?

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles