Kcr roars in mahboobnagar

KCR roars in Mahboobnagar, RDS water, Joorala canal water, Valmiki communities, Thandas of tribes

KCR roars in Mahboobnagar, RDS water, Joorala canal water

పట్టు తక్కువగా ఉన్న మెహబూబ్ నగర్ లో కెసిఆర్ గర్జన

Posted: 03/07/2014 08:04 AM IST
Kcr roars in mahboobnagar

ఆర్డీఎస్ ఆయకట్టుకి నీరు సరిపడా రాకపోవటం మీద ఆగ్రహాన్ని ప్రదర్శించిన తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు సమైక్యరాష్ట్రంలో మెహూబూబ్ నగర్ కి అన్యాయం జరిగిందని, తెలంగాణాలో దాన్ని సరిదిద్దుతామని చెప్పారు.  ఆయకట్టుకి నీళ్ళెట్లరావో చూస్తా, కెసిఆర్ దెబ్బేమిటో చూపిస్తానంటూ సవాల్ చేసారు. 

మోహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన కెసిఆర్ తాను కొట్లాడి ఆయకట్టను సాధించినా అప్పటి పాలకులు అందులో నీళ్ళు తెప్పించలేక పోయారంటూ తెలుగు దేశం పార్టీని తూలనాడారు.  తాను కొట్లాడి ఆయకట్టను సాధించినా అప్పటి పాలకులు అందులో నీళ్ళు తెప్పించలేక పోయారంటూ కెసిఆర్ తెలుగు దేశం పార్టీని తూలనాడారు.  ఈ విషయాన్ని తాను శాసనసభలో చంద్రబాబుని ప్రశ్నించానని, ఇక్కడ రైతాంగం పడుతున్న కష్టాలను వివరించానని, దాంతో జూరాల నుంచి లింక్ కెనాల్ ద్వారా 25000 ఎకరాలకు సాగునీరు అందిస్తానని వాగ్దానమైతే చేసారు కానీ ఆ తర్వాత ఎందరు మంత్రులు సామంతులొచ్చినా నీళ్ళివ్వలేకపోయారంటూ కెసిఆర్ అందుకు తన వేదనను వ్యక్తపరచారు.  చంద్రబాబు జలయజ్ఞం ఏమైందని అడిగారు.

55 సంవత్సరాలుగా కాంగ్రెస్, తెదేపాల పాలనను చూసాం.  సమైక్య రాష్ట్రంలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు.  ఇప్పుడు మనకు తెలంగాణా వచ్చింది.  దాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్తూ ఢిల్లీలో సంఖ్యాబలం లేకపోవటం వలన కొట్లాడటం కష్టమైందని, 17 మంది ఎంపీలు మనవాళ్ళుంటే పరిస్థితే వేరుగా ఉండేదని, అందువలన ఈసారి తెరాస ను గెలిపించి బలోపేతం చెయ్యమని కెసిఆర్ అన్నారు. 

ఎన్నికల్లో గెలుపు కచ్చితంగా తమదేనన్న ధీమా వ్యక్తపరచిన కెసిఆర్, తెరాస తోనే తెలంగాణా అభివృద్ధి సాధ్యమని చెప్తూ, మోసపోతే గోసపడతాం, గొర్రెలు తినేవాడు పోతే బర్రెలు తినేవాడు, వాడు పోతే దున్నపోతులను తినేవాడు వచ్చి తెలంగాణాను అభివృద్ది చెయ్యలేదని అన్నారు కెసిఆర్.  మళ్ళీ ఆ పార్టీలనే గెలిపిస్తే మళ్ళీ అలాగే అవుతుందని, అందువలన తెరాసకు మాత్రమే పట్టం కట్టాలని కెసిఆర్ అన్నారు. 

కెసిఆర్ ప్రత్యేకంగా చేసిన వాగ్దానాలలో ఒకటి వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించటం, తొలిసంతకం దాని మీదనే చెయ్యటం, కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థనే రద్దు చేసి అందరినీ పర్మనెంట్ చెయ్యటం, గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించటం, వాళ్ళకి 12 శాతం రిజర్వేషన్ కల్పించటం, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించటం, అంగన్ వాడీ సమస్యలను పరిష్కరించటం ఇత్యాది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles