India aviation 2014 five days summit

India aviation 2014 five days International summit, Ashok Kumar Civil Aviation Ministry, Developmental program of Civil Aviation, Civil aviation air show

India aviation 2014 five days international summit

ఆకాశంలో ఐదురోజుల విన్యాసాలు

Posted: 03/11/2014 08:24 AM IST
India aviation 2014 five days summit

ఇండియా ఏవియేషన్ 2014 పేరుతో హైద్రాబాద్ లో ఐదురోజులపాటు జరుగునున్న 4 వ అంతర్జాతీయ పౌర విమానయాన  సదస్సులో 18 దేశాలకు చెందిన 250 విమాన సంస్థలు పాల్గొంటున్నాయి. 

ఈ కార్యక్రమం కోసం సోమవారం బేగంపేటలో జరిగిన సన్నాహ సమారోహంలో మాట్లాడిన భారత పౌర విమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి అశోక్ కుమార్, ఈ అంతర్జాతీయ సదస్సులో వ్యాపార వాణిజ్య చర్చలు మూడురోజుల పాటు చోటు చేసుకుంటాయని, చివరి రెండు రోజులలో అందరికీ ప్రవేశం ఉంటుందని తెలియజేసారు.  భారత విమానరంగ అభివృద్ధే ధ్యేయంగా ఈ అంతర్జాతీయ సదస్సుని నిరవహిస్తున్నామని ఆయన అన్నారు. 

సోమవారం జరిగిన సన్నాహ కార్యక్రమంలో ఆకాశంలో ప్రదర్శించిన విమాన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.  ఆకాశంలో విమానాన్ని గిరగిరా తిప్పుతూ చేసిన ప్రదర్శనను చూసిన వారంతా ఆశ్చర్యానందాలతో కేరింతలు కొట్టారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles