Srikrishna kulkarni criticizes rahul gandhi

Srikrishna Kulkarni criticizes Rahul Gandhi, Gandhi grand grand son Kulkarni, RAhul Gandhi blames RSS, Mahatma Gandhi, AAP, Congress party

Srikrishna Kulkarni criticizes Rahul Gandhi

రాహుల్ గాంధీ మీద ధ్వజమెత్తిన గాంధీ మునిమనుమడు

Posted: 03/11/2014 09:16 AM IST
Srikrishna kulkarni criticizes rahul gandhi

మహాత్మా గాంధీ మునిమనుమడు కులకర్ణి రాహుల్ గాంధీ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ, మీద నెహ్రూ కుటుంబం- మీకు మహాత్మా గాంధీకీ ఏమిటి సంబంధం అని సూటి ప్రశ్న వేసారు.

మహాత్మా గాంధీ మరణానికి ఆర్ఎస్ఎస్ కారణమని రాహుల్ గాంధీ అన్న మాటలను ఖండిస్తూ, అసలు మీకూ గాంధీకి ఏమిటి సంబంధమని కులకర్ణి ఎదురు ప్రశ్న వేసారు.  మహాత్మా గాంధీ పేరును వాడుకునే హక్కు మీకు ఎక్కుడుందన్నది ఆయన ప్రశ్న.  ఎన్నికలలో ప్రయోజనం కోసమే గాంధీ పేరును వాడుకుంటున్నారు కానీ గాంధీ హత్య తర్వాత విచారణ చేసిన కమిటీలు ఆర్ఎస్ఎస్ ని తప్పు పట్టలేదని గుర్తు చేసారు. 

తమిళయన్లనో కొందరు రాజీవ్ గాంధీని హత్య చేసారు.  అయితే తమిళులందరినీ దోషులంటారా అని అడిగారు కులకర్ణి.  ఆర్ఎస్ఎస్ తో పాటు రాజీవ్ గాంధీని చంపిన తమిళులు, ఇందిరా గాంధీని చంపిన సిక్కులను కూడా దేశం నుండి పంపిచేయండైతే అన్నారాయన. 

జాతీయ స్థాయిలో గాంధీ అంటే గుర్తుకొచ్చేది మహాత్మా గాంధీయే.  అందువలన తెలివిగా ఆ పేరును ఉపయోగించుకోవటం కోసమే రాహుల్, సోనియాలు గాంధీ పేరును, ఆయన ఫొటోను ప్రకటనలలో వాడుకుంటున్నారు.  నెహ్రూ కుటుంబీకులైయ్యుండి, నెహ్రూ ఫోటోని ఎందుకు పెట్టరు అని అడిగారు కులకర్ణి.

మహాత్మాగాంధీ మూడవ కుమారుడు రామ్ దాస్ గాంధీ కూతురు కొడుకు శ్రీకృష్ణ కులకర్ణి.  గాంధీ మనుమడు రాజ్ మోహన్ గాంధీ ఆఆపా లో తూర్పు ఢిల్లీ నుంచి పార్లమెంటుకి పోటీ చేస్తున్నారు.  శ్రీకృష్ణ కులకర్ణి కూడా ఆఆపా లో పనిచెయ్యటానికి నిర్ణయించుకున్నారు. 

గాంధీ మునిమనుమడినని తెలిసినవాళ్ళు మీకు సోనియాగాంధీ ఏమవతుంది, రాహుల్ గాంధీ ఏమవుతాడు అని అడిగితే ఏమీ కారని చెప్పేటప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది నాకు కానీ సంవత్సరాల తరబడి నెహ్రూ కుటుంబీకులు గాంధీ పేరును విచ్చలవిడిగా వాడుకుంటున్నారు అన్నారు కులకర్ణి. 

ఇటువంటి వాళ్ళా మన నాయకులయ్యేది అంటూ కులకర్ణి ప్రశ్నించారు.  మహాత్మా గాంధీ 1930 లో కాంగ్రెస్ ని వదిలిపెట్టారు.  అయినా పోస్టర్లలో సోనియా ఫొటో ఉంటుంది, రాహుల్ ఫొటో ఉంటుంది, పక్కన మహాత్మా గాంధీ ఫొటో ఉంటుంది ఏమిటి వీళ్ళకీ మహాత్ముడికీ ఉన్న సంబంధం అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు కులకర్ణి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles