Political parties face problems in seat adjustments

Political parties face problems in seat adjustments, Bharatiya Janata party, Jaswant Singh, L K Advani, Murai Manohar Joshi

Political parties face problems in seat adjustments

రాజకీయపార్టీలకు సొంత గూటిలోనే పరీక్షలు!

Posted: 03/22/2014 04:59 PM IST
Political parties face problems in seat adjustments

ప్రైవేట్ కంపెనీల్లో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లను ఇచ్చేవేళ యాజమాన్యానికి, రాజకీయ రంగంలో సీట్ అడ్జస్ట్ మెంట్ల వేళ పార్టీ అధినాయకత్వానికి నిజంగా తలనొప్పుల సమయమే.   వ్యాపారంలో నిలదొక్కుకోవటం, రాజకీయంగా ఎదగటం వాళ్ళకి ఒక ఎత్తైతే, తన సొంత మనుషులను అనునయించటం మరో ఎత్తు. 

రాజకీయాలలో పోగొట్టుకునే దాని విలువ ఎక్కువ, పైగా ఒకసారి చెయిజారిపోతే మరో ఐదు సంవత్సరాల వరకు నోరు మెదిపే అవకాశం ఉండదు కాబట్టి గట్టి పట్టు పడుతుంటారు. 

ఈసారి ఎన్నికలలో వలసలు కూడా ఎక్కువయ్యాయి, ఆ వలస వచ్చిన నాయకులకు వాగ్దానాలను నిలబెట్టుకోవటంలో పాతవాళ్ళకి అన్యాయం జరిగినట్లుగా వాళ్ళు భావించటం మొదలవుతోంది.  పార్టీ అధినాయకత్వానికి ముఖ్యం పార్టీ నిలదొక్కుకోవటం, అధికారాన్ని చేపట్టటం కాబట్టి కొందరు నాయకులను పార్టీ భవిష్యత్ దృష్ట్యా త్యాగాలు చెయ్యాలని కోరుకుంటారు కానీ ఎవరూ అలాంటి పనికి సిద్ధంగా ఉండరు.

భారతీయ జనతా పార్టీకి ఇతర పార్టీలతో ఇతర అంశాలతో ఉన్న తలనొప్పులు ఎలాగూ ఉన్నాయి కానీ సీట్ల కేటాయింపులలో సీనియర్స్ నుంచి నిరసన రావటం పార్టీకి నష్టం చేస్తుంది.  ప్రధానమంత్రి అభ్యర్థిత్వంలో సీనియర్ నేత అద్వానీతో పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులే ఏర్పడ్డాయి.  మురళీ మనోహర్ జోషీ వారణాసి సీటు అడిగినట్టుగానే ఇప్పుడు జస్వంత్ సింగ్ రాజస్తాన్ లో బార్మర్ సీటుకోసం పట్టుపట్టారు.  అది లభించకపోయేసరికి జస్వంత్ సింగ్ అగ్గిమీద గుగ్గిలంలా అయ్యారు. 

కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కల్నల్ సోనారామ్ ఛౌధరికి బార్మర్ సీటునివ్వటం జస్వంత్ సింగ్ కి మనస్తాపాన్ని కలిగించింది.  రేపు జస్వంత్ సింగ్ భాజపా టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చెయ్యటానికి సిద్ధపడుతున్నారు.  పార్టీని విడిచిపెట్టేటప్పుడు ఎవరూ మామూలుగా పోరు.  పార్టీలోని లొసుగులను బహిర్గతం చేస్తామని హెచ్చరిస్తుంటారు.  అది పార్టీలకు మరో సమస్య. 

పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి పార్టీ సిద్ధాంతాలను ఎప్పుడూ గౌరవించని బయటివారికి పట్టం కట్టటం శోచనీయమంటూ జస్వంత్ సింగ్ తన మనో వేదనను వ్యక్తంచేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles