Women policing for villages without belt shops

Women policing for villages without belt shops, YS Jagan, Belt shops in villages, Belt shops spoiling Youth, YSR Congress Janabheri, YSRCP Janabheri at Yalamanchili

Women policing for villages without belt shops, YS Jagan, Belt shops in villages, Belt shops spoiling Youth, YSR Congress Janabheri, YSRCP Janabheri at Yalamanchili

మద్యపానాన్ని అరికట్టటానికి మహిళా పోలీసింగ్- జగన్ వాగ్దానం

Posted: 03/28/2014 01:15 PM IST
Women policing for villages without belt shops

విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో జరిగిన వైయస్ ఆర్ జనభేరి బహిరంగ సభలో మాట్లాడుతూ, మద్యపానం మహమ్మారిలా వ్యాపించి యువతను పెడదోవ పట్టిస్తోందని, అందువలన గ్రామాలలో బెల్ట్ షాపులను మూసివేయిస్తానని వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు. 

నియోజక వర్గం లోని ప్రధాన స్థానాలలోను, స్టార్ హోటళ్ళలో మాత్రమే మద్యం వినియోగాన్ని పరిమితం చేసేట్టుగా చూస్తానని జగన్ అన్నారు. 

యలమంచిలి జనభేరికి విచ్చేసిన అశేష ప్రజానీకాన్ని సంబోధిస్తూ మాట్లాడిన జగన్, గ్రామాలలో బెల్ట్ షాపులు లేకుండా చెయ్యటం కోసం ఆయా గ్రామాలలోని మహిళలనే నిఘా పెట్టేందుకు నియమిస్తామని అన్నారు.  పదిమంది మహిళలతో కూడిన బృందాలు ఆయా గ్రామాలలో బెల్ట్ షాపులను లేకుండా చేస్తారని జగన్ అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles