Pawan kalyan janasena objects

Pawan Kalyan Janasena objects, Janasena Vizag public meeting, Pawan Kalyan speech at Vizag, State division

Pawan Kalyan Janasena objects

జనసేన అసలు లక్ష్యం

Posted: 03/28/2014 02:04 PM IST
Pawan kalyan janasena objects

జనసేన పార్టీని పెట్టటానికి అసలు లక్ష్యం ప్రజల్లో రాజకీయాల మీద అవగాహన కల్పించటమేనని ఆ పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్ లో మీడియా ప్రతినిధులతో అన్నారు.

గురువారం విశాఖపట్నంలో ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్ట మొదటి బహిరంగ సభను నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం హైద్రాబాద్ తిరిగి వచ్చినప్పుడు అన్న మాటలవి.
ఎన్నికలలో ప్రచారం చేసేటప్పుడు ఎవరెవరన్నది తెలియకుండా చెయ్యటం జరగదని కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. 

విశాఖపట్నంలో తనదైన శైలిలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగానూ మాట్లడాలేదు, విప్లవ నాయకుడిగానూ మాట్లాడలేదు.  అందువలన చాలమందికి ఆయన పార్టీ ఉద్దేశ్యమేమిటన్నది అంతు చిక్కకుండా ఉంది.  పవన్ కళ్యాణ్ డ్రస్ కూడా అంతే మామూలు కాజువల్స్ ని వేసుకుని వచ్చారు కానీ రాజకీయ పార్టీ నాయకుడి వేషం కట్టటానికి ఖాదీ వేసుకోనని చెప్పారు.  అందుకు కారణం ఎన్నికల సమయం అవటం వలన ఖాదీకి డిమాండ్ పెరిగి వాటి రేట్లు అమాంతం పెరిగిపోయాయని చమత్కరించారు కూడా. 

కాంగ్రెస్ పార్టీని తప్ప మరెవరినీ నిందించని పవన్ కళ్యాణ్ అది కూడా పార్టీ విధానం వలనే కానీ వ్యక్తిగతంగా ఎవరిమీదా ద్వేషం లేదని, సోనియా గాంధీ కూడా ఏమో మారిపోవచ్చు, సీమాంధ్రకు క్షమాపణ చెప్పినా చెప్పవచ్చని, అందువలన తనకి మానవత్వం మీద ఇంకా నమ్మకం ఉందని చెప్తూ ఉద్వేగాలలో ఏమైనా అనుకున్నా కూర్చుని మాట్లాడుకుని సామరస్యంగా పోవటంతో సమస్యలు పరిష్కరించబడతాయని, అందువలన రాజకీయ నాయకులు స్వార్థ బుద్ధితో చేసిన వేర్పాటు వాదం వలన ఇరు ప్రాంతాల వారిలో విభేదాలు రాగూడదని ఆయన అన్నారు.

తను ఎన్నికలలో పోటీ చెయ్యనని, అందుకు సమయం రాలేదని, సరైన నాయకత్వ లక్షణాలున్నవారు దొరికినప్పుడు చూస్తామని అన్న పవన్ కళ్యాణ్, రాజకీయ నాయకులు వారి వృత్తి ధర్మంగా వారిని నడుచుకోమని, వారికి అడ్డురానని చెప్తూ, ప్రజలు ఎవరికి పట్టం కట్టదలచుకుంటే వారికి కట్టండని, తన ఉద్దేశ్యంలో మాత్రం నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా తగిన అభ్యర్థని అన్నారు కానీ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడలేదు.  అయితే ఎన్నికలు జరుగుతాయి, నాయకులు వస్తారు, నేను అడ్డురాను, వోట్లను చీలనివ్వను, కానీ అవినీతికి పాల్పడితే మాత్రం ఖబర్దార్ జనసేన ఉందని పవన్ కళ్యాణ్ హెచ్చరికలు కూడా చేసారు.  అంటే, వేరెటువంటి స్వార్థ చింతన లేదు కాబట్టి రాజకీయాల మీద మా నిఘా ఉంటుంది సుమా, ఇంతవరకు ఎవరు అడగటం లేదు అని అనుకుంటున్నారేమో మేమున్నాం జాగ్రత్త అన్న చేతావని చేస్తున్నారు రాజకీయ నాయకులకు.

పార్టీలంటే ఇలా కూడా ఉంటాయా అని కొందరు ఆశ్చర్యపడుతుంటే, ఓస్ ఇంతేనా అని కొందరు, పోనీలే మనకు పోటీకి రావటం లేదు హమ్మయ్య అని మరికొందరు భిన్నమైన రీతిలో అనుకుంటున్నారు.  కానీ యువతనే లక్ష్యం చేసుకున్నందుకు ఇప్పటి వరకు ఏ ముద్రా పడని, రాజకీయంగా ఎటువంటి ప్రభావాలకు లోనవని యువత మాత్రం పవన్ స్పూర్తిని పూర్తిగా తీసుకున్నట్లుగానే కనపడుతోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles