Digvijay ready to contest from varanasi

Digvijay ready to contest from Varanasi, Narendra Modi BJP, Arvind Kejriwal AAP, Congress party, Bharatiya Janata party, Rahul Gandhi

Digvijay ready to contest from Varanasi

మోదీతో పోటీకి సిద్ధపడ్డ దిగ్విజయ్ సింగ్

Posted: 03/28/2014 04:42 PM IST
Digvijay ready to contest from varanasi

టైమ్స్ నౌ తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏఐసిసి జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్, తాను వారణాసితో సహా ఏ పార్లమెంట్ సీటుకు పోటీ చెయ్యటానికైనా తయారేనని, పార్టీ ఏం నిర్ణయిస్తే అదేనని అన్నారు.  

తాను ఎటువంటి సవాళ్ళని ఎదుర్కోవటానికైనా సిద్ధమేనని, తాను పెద్దగా మద్దతుగల అభ్యర్థి కాకపోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడనని, అందువలన పార్టీ ఏం చెప్తే అది చేస్తానని అన్నారు దిగ్విజయ్ సింగ్.  

అంతకు ముందు ఉత్తర్ ప్రదేశ్ కి జనరల్ సెక్రటరీ ఇన్ ఛార్జ్ గా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ మీద వారణాసిలో పోటీచెయ్యటానికి ఉత్సాహం చూపించారు.  

నరేంద్ర మోదీ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు.  ఒకటి గుజరాత్ లో వడోదరా నుంచి.  అక్కడ రాహుల్ గాంధీ  మద్దతుదారు మధుసూధన్ మిస్త్రీ పోటీ చేస్తున్నారు.  ఆయనను కాంగ్రెస్ పార్టీ మోదీకి సమవుజ్జీగానే భావిస్తోంది.   ఇక వారణాసిలో కూడా మోదీ ప్రాభవాన్ని తగ్గించే అభ్యర్థిని నిలబెట్టి మోదీ గెలుపుని కష్టం చెయ్యటమే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యం.  

ఎంపీగానే గెలవలోకపోతే ప్రధాని అవటం జరగదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మోదీకి పోటీగా శక్తివంతమైన అభ్యర్థులను నిలబెట్ట దలచుకుంది.  

ఈలోపులో ఢిల్లీలో కాంగ్రెస్ మద్దతుతో అధికార పీఠాన్ని అధిరోహించిన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ కూడా వారణాసిలో మోదీకి గట్టి పోటీ ఇవ్వటానికి సిద్ధమయ్యారు.  

మోదీతో పోటీకి సిద్ధమైనా, మోదీ ని ముక్కలు ముక్కలుగా ఖండిస్తానని బహిరంగ సభలో అన్న ఇమ్రాన్ మసూద్ వ్యాఖ్యలను ఆయన గట్టిగా ఖండించారు.  అది రెచ్చగొట్టే మాటని, నేరంగా పరిగణించవలసిన చర్యని అన్నారు దిగ్విజయ్ సింగ్.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles