Chandrababu approves pawan kalyan statements

Chandrababu approves Pawan Kalyan statements, Telugu Desam party, Hyderabad, More cities in seemandhra Babu assures, Pawan Kalyan Janasena party, Actress Sana Khan joins TDP

Chandrababu approves Pawan Kalyan statements

పవన్ మాటలకు చంద్రబాబు ఆహ్లాదం

Posted: 03/28/2014 03:58 PM IST
Chandrababu approves pawan kalyan statements

వోట్లను చీల్చటం ఇష్టం లేకనే ఎన్నికలలో పోటీ చెయ్యటం లేదని, మంచి రాజధానిని నిర్మించేవారికే ఓటెయ్యమని అన్న పవన్ కళ్యాణ్ మాటలను సమర్థిస్తున్నానని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అన్నారు.  

సినీనటి సన తో పాటు పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన శ్రీరంగనాధరాజు, మోసెజ్ రాజు తెలుగు దేశం పార్టీలో చేరిన సందర్భంగా మాట్లాడిని చంద్రబాబు నాయుడు, హైద్రాబాద్ లాంటి నగరాలను నిర్మిస్తానని అన్నారు.  హైద్రాబాద్ ఒక్కదాన్నే అభివృద్ధి పరచటం వలన కలిగిన నష్టమేమిటో తెలిసింది కాబట్టి, రాష్ట్రంలో అలాంటి నగరాలను అభివృద్ధి చేస్తామని అనటం చంద్రబాబు ఉద్దేశ్యం.

ఇక నగరాభివృద్ధి విషయానికొస్తే, దొంగలకు అధికారమిస్తే పెట్టుబడులు  పెట్టేందుకు ఎవరూ ముదుకు రారని అన్నారాయన.  వైకాపా కి వోటేస్త్ పరువుపోతుందనే ఉద్దేశ్యంలో ప్రజలున్నారని చంద్రబాబు అన్నారు.  

ఎన్నికలలో పోటీచెయ్యనని, ఎవరికీ అడ్డురానని, వోట్లను చీల్చటం ఇష్టం లేదని అన్న పవన్ కళ్యాణ్, వోటర్లు బాగా ఆలోచించి ఎవరు సమర్ధవంతులనుకుంటే, ఎవరిని గెలిపించాలనుకుంటే వారిని గెలిపించండని చెప్పారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles