How can jagan on bail become cm

How can Jagan on bail become CM asks Jairam Ramesh, Elections 2014, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014 videos, Lok Sabha Elections 2014

How can Jagan on bail become CM asks Jairam Ramesh

బెయిల్ మీద వచ్చి ముఖ్యమంత్రి అవుతాడా?

Posted: 05/02/2014 08:22 AM IST
How can jagan on bail become cm

బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చిన నాయకుడు ముఖ్యమంత్రైన సందర్భాలు చరిత్రలో ఎక్కడా లేవని కాంగ్రెస్ నాయకుడు కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు.  

ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైరాం రమేష్ వైయస్ జగన్మోహన రెడ్డి గురించి మాట్లాడుతూ, జైలు నుంచి బయటకు వచ్చిన వాడు ముఖ్యమంత్రి అవటమనేదాన్ని తాను ఊహించుకోనుగూడా లేనని అన్నారు.  ముఖ్యమంత్రి ని ఎన్నుకునే హక్కు సీమాంధ్ర ప్రజలకుంది.  కానీ ఆ ముఖ్యమంత్రి ఎలాంటి వాడు కావాలో ఆలోచించుకునే అవసరం కూడా వాళ్ళకి ఉందని ఆయన అన్నారు.  

కొత్త రాష్ట్రానికి మొట్ట మొదటి ముఖ్యమంత్రి ఎన్నుకోబడుతున్న తరుణంలో ఆయన జైలు నుంచి బెయిల్ మీద వచ్చినవాడు కావాలా లేక సీమాంధ్ర హక్కులను పరిరక్షించే కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావాలా అన్నది ప్రజలే ఆలోచించుకోవలని అన్న జైరాం రమేష్ జగన్ చరిత్రను, ఆయన ఖర్చు పెడుతున్న విధానాన్ని చూడండి, బయటకు తెస్తున్న ఆ నిధులను చూడండి విషయమేమిటో మీకే తెలుస్తుందనన్నారు జైరాం రమేష్.

జగన్ కాంగ్రెస్ డిఎన్ ఏ అన్న దిగ్విజయ్ సింగ్ మాటలను ఖండిస్తూ, మా నాయకులెవరూ బెయిల్ మీద లేరు అన్నారు జైరాం రమేష్.  విచ్చలవిడిగా నదీ ప్రవాహంలా ఎన్నికల కోసం డబ్బును ఖర్చుపెడుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టిన జైరాం రమేష్ ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా డబ్బు ఏరులై పారుతోందని అన్నారు.  కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడైన వైయస్ఆర్ పేరుని కాని, కాంగ్రెస్ పేరుని కానీ జగన్ కు వాడే అధికారం లేదని కూడా జైరాం రమే, అభిప్రాయపడ్డారు.

ఒకవేళ సీమాంధ్ర ప్రజలే కనక చంద్రబాబుని ఎన్నుకుంటే తాను ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలకు రాజ్యసభ సభ్యుడిగా మద్దతునిస్తానని కూడా జైరాం రమేష్ హామీ ఇచ్చారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles