Governor narasimhan sets may 15th as deadline

governor narasimhan, governor narasimhan deadline, andhra pradesh bifurcation, governor narasimhan ap bifurcation, may 15th deadline, esl narasimhan, 2014 election.

governor narasimhan sets may 15th as deadline

మే 15 వరకు-గవర్నర్ డెడ్ లైన్ ?

Posted: 05/06/2014 07:39 AM IST
Governor narasimhan sets may 15th as deadline

రాష్ట్ర విభజన ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 15 నాటికి పూర్తి చేయాల్సిందేనని ఉన్నతాధికారులను రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ తాజాగా ఆదేశించారు. అపాయింటెడ్ డే అయిన జూన్ 2 వరకు ప్రక్రియను కొనసాగిస్తే సహించేది లేదని, తాను విధించిన గడువును పొడిగించబోనని గవర్నర్ తేల్చి చెప్పారు.

ఎపి బేవరీజస్, పౌర సరఫరాలు, విత్తన సరఫరా, జెన్‌కో, ట్రాన్స్‌కో తదితర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 20 సంస్థలు వచ్చేనెల రెండో తేదీ లోగా రెండు సంస్థలుగా మారనున్నాయి. గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ జరిగిన సమావేశంలో ఉన్నత స్థాయి సమీక్షలో ఉన్నత స్థాయి సమీక్షా కమిటీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.

అయితే కొన్ని కార్పొరేషన్లను విభజించే అవకాశం ఉన్నది. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే వ్యవసాయ ప్రాధాన్యమైన విత్తనాల పంపిణీ సంస్థ, బేవరీజస్ సంస్థ, ఎపిఎస్ ఆర్‌టిసి, జెన్‌కో, ట్రాన్స్‌కోలను ప్రాధాన్యతా ప్రాతిపదికన విభజించాలని అధికార వర్గాలు తెలిపాయి.

ఈనెల 15వ తేదీ లోగా విభజన ప్రక్రియ పూర్తి చేయాలని గవర్నర్ నరసింహన్, అధికారులను ఆదేశించారు. ఆ వ్యవధిలోగా ఎట్టి పరిస్థితుల్లో పని పూర్తి చేయాలని గవర్నర్ ఆదేశించారు. 22 ప్రభుత్వ శాఖలను రెండు రాష్ట్రాల మధ్య విభజించడం తప్పనిసరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి కె మహంతి, గవర్నర్‌కు తెలిపారు.89 కంపెనీల విభజనపై అపెక్స్ కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, గవర్నర్‌కు వివరించారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles