Modi tweets back to priyanka comments

Modi tweets back to priyanka comments, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Modi tweets back to priyanka comments

మోదీ ప్రచారం ఆగినా ఆగని విమర్శలు!

Posted: 05/06/2014 01:03 PM IST
Modi tweets back to priyanka comments

ఎన్నికల ప్రచారానికి గల గడువులో ఆఖరి రోజైన సోమవారం, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీచేస్తున్న అమేథీలో భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీతో కలిసి బహిరంగ సభను నిర్వహించారు.  గాంధీ కుటుంబం గురించి ప్రధానంగా మాట్లాడిన మోదీ మూడు తరాలుగా ఆ కుటుంబం అమేథీని నాశనం చేస్తూ వస్తోందని అన్నారు.  కనీస సదుపాయాలు కూడా సమకూర్చలేని ఆ కుటుంబంతో సంబంధం తెగ్గొట్టుకోమని మోదీ అమేథీ వోటర్లకు పిలుపునిచ్చారు.  అమేథీలో తాను బదలా (పగ) తో రాలేదని, కేవలం బదలావ్ (అభివృద్ధి) కోసం వచ్చానని అన్నారు.  

ఎవరీ స్మృతి ఇరానీ అని ప్రియాంకా అన్నదానికి సమాధానంగా ఆమె నా సోదరి అని చెప్తూ, చూసారా వాళ్ళ గర్వం అని అన్నారు మోదీ.

మోదీ చేసిన ప్రసంగం మీద వ్యాఖ్యానిస్తూ మోదీ చేస్తున్నది చాలా తక్కువ స్థాయి రాజకీయాలని ప్రియాంక అనగా, అందుకు బదులుగా మోదీ ట్విట్టర్లో, నేను తక్కువ జాతివాడిని కాబట్టి నా రాజనీతి తక్కువ స్థాయిలోనే ఉంటుంది, ఈ తక్కువ స్థాయి రాజనీతి 60 సంవత్సరాల వోట్ బ్యాంక్ అనీతి పాలన నుంచి ప్రజలను రక్షిస్తుంది, కోటానుకోట్ల ప్రజానీకం కన్నీరు తుడుస్తుంది అని పోస్ట్ చేసారు.  

మోదీ తన మాటలలో రాహుల్ గాంధీని షెహజాదా (యువరాజు) అని, గాంధీ కుటుంబాన్ని రాజ్ పరివార్ (రాజకుటుంబం) అని సంబోధించారు.

అలా వోటర్ ని ప్రభావితం చెయ్యగూడని రోజున కూడా మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూనేవుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles