ప్రేమ గుడ్డిది అంటారు ప్రేమికులు ఒకరి నొకరి బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యతనివ్వనప్పుడు. ప్రేమలో పడ్డవాళ్ళు సామాజిక హోదాలో హెచ్చుతగ్గులు పట్టించుకోరని కూడా తెలుసు. కానీ, ఎత్తు పొడవుల్లో ఉన్న అంత పెద్ద తేడాను కూడా పట్టించుకోరని బ్రెజిల్ కి చెందిన వర్ధమాన మోడల్ ఎలిసాని డా క్రూజ్ సిల్వా ప్రేమకధను చూస్తే అర్థమౌతుంది.
ధూమ్ 3 సినిమాలో కత్రినా కైఫ్, అమీర్ ఖాన్ ల జంటకు పొడవులో ఉన్న తేడా కన్నా ఇంకా ఎక్కువ ఈ బ్రెజిలియన్ జంటల పొడవుల మధ్య వ్యత్యాసం. 6 అడుగుల 8 అంగుళాల పొడవున్న ఎలిసాని 5 అడుగుల 4 అంగుళాల పొడవున్న తన బాయ్ ఫ్రెండ్ ఫ్రాన్సినాల్డో డ సిల్వా కార్వాల్హోతో మూడు సంవత్సరాలకు పైగా డేటింగ్ చేస్తోంది. పొడవులో పూర్తిగా 1 అడుగు 4 అంగుళాలు తేడా ఉన్న వాళ్ళిద్దరూ బీచ్ లో నడుస్తుంటే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.
పిట్యూటరీ గ్లాండ్ లో ఉన్న ట్యూమర్ వలన ఆమె అంత పొడవు పెరిగింది కానీ ఎలిసాని వయసు కేవలం 18 సంవత్సరాలే. వాళ్ళిద్దరూ మొదటిసారి కలిసినప్పుడు ఎలిసాని అప్పుడే స్వీట్ 16 లో అడుగుపెట్టిందట. మార్చి 29, 2014 న ఫ్రాన్సినాల్డో పెళ్ళి ప్రతిపాదన తీసుకుని రావటానికి ముందు అలాంటిదేదో వస్తుందని ఆమె కాదంటూ వచ్చిందట. కానీ ఫ్రాన్సినాల్డో ఎత్తైన ప్రియురాలి వలన తనకు ఆనందం కలుగుతుందంటున్నారు. తన ఫియాన్సీని తన మిత్రులకు పరిచయం చెయ్యటంలో కూడా అతను ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించాడు.
సంవత్సరకాలం నుంచి బ్రెజిల్ లో సాలినోపోలిస్ పట్టణంలో చిన్న ముద్దైన ఇంట్లో నివాసం ఉంటున్న వీరిద్దరూ త్వరలో ఆ ఇంట్లో చిన్ని పాదాలతో నడియాడే బిడ్డడి కోసం కలలు కంటున్నారు. ఆమె వయసు చిన్నదే కాబట్టి ఫ్రాన్సినాల్డో అవసరమైతే దత్తత తీసుకుందామని అనుకుంటున్నాడట. పెళ్ళికి కూడా ఏమిటి తొందర, ఎంగేజ్ మెంట్ కాలాన్ని ఇంకా పొడిగిద్దామని అతను అంటుంటే, ఎలిసాని మాత్రం పెళ్ళి గౌనుకి ఆర్డర్ ఇచ్చేస్తోంది.
మొదటిసారి వాళ్ళ చూపులు కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఫ్రాన్సినాల్డో బ్రెడ్ కొనటానికి దుకాణానికి పోయినప్పుడు దూరంగా ఆమెను చూసి ఎప్పటి నుండో ఎత్తుగా ఉండే ప్రియురాలి కోసం ఉన్న కోరికతో ఈమె నాకు దక్కితే బాగుండునని అనుకున్నాట్ట.
వీళ్ళిద్తరూ ఆనందంగానే ఉన్నా, ఎలిసానో తల్లి మాత్రం వీళ్ళద్దరి జంట బావుంటుందా అని ఆలోచనతో వ్యధచెందుతోందట. మిగతా అంతా బాగానే వున్నా, దారిలో పోతున్నప్పుడు తేరిపార చూసేవాళ్ళని, తాటిచెట్టులా ఎంత ఎత్తుందో చూడు అన్న కామెంట్లు అతన్ని బాధపెడుతుంటాయట- అదీ ఆమె దృష్టిలో ఆలోచించి. ఆమె కూడా మనిషే కదా ఆమె బాధపడుతుందేమో అనే ఇంగితం లేదు వాళ్ళకి అని ఫ్రాన్సినాల్డో మనసు నొచ్చుకుంటుంటుందని చెప్పాడతను.
ఏమైనా మనసులు కలవటమే ముఖ్యం కాబట్టి, వీళ్ళ ప్రేమ, ఆనందాల గురించి ఇతరులకు అర్థం కాకపోవచ్చు కాబట్టి వీళ్ళిద్దరూ వీరి ప్రపంచంలో హాయిగా గడపుతూ బిడ్డా పాపలతో దాంపత్య సుఖాన్ని అనుభవిస్తారని ఆశిద్దాం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more