Voting in seemandhra increased from past

Voting in Seemandhra increased from past, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Voting in Seemandhra increased from past

సీమాంధ్రలో పోలింగ్ శాతం ఎందుకు పెరిగింది?

Posted: 05/08/2014 09:06 AM IST
Voting in seemandhra increased from past

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ప్రకటించినదాని ప్రకారం సీమాంధ్రలో పోలింగ్ శాతం 80 వరకు ఉండవచ్చని అంచనా.  ఎందుకంటే పోలింగ్ ముగిసే సమయానికే 77 శాతం చేరుకుంది.  

వోటర్ చైతన్యంతో పాటు నిన్న వాతావరణం అనుకూలంగా ఉండటం కూడా అధికశాతం పోలింగ్ కి ఉపకరించింది.  అందువలన చాలా మంది వోటర్లు త్వరత్వరగా వోటింగ్ ముగించినట్లుగా తెలుస్తోంది.  ఎందుకంటే మధ్యాహ్నం నాలుగు గంటలకే పోలింగ్ శాతం 70 వరకు చేరుకుంది.  

ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా మినహా మిగిలిన జిల్లాలలో 2009 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం బాగా పెరిగిందని భన్వర్ లాల్ అన్నారు.  కృష్ణా జిల్లాలో కొద్దిగా తగ్గింది.  

ఈసారి తాము కోరుకున్న నాయకులనే తప్పక గెలిపించాలనే కసి సీమాంధ్రవాసులలో బాగా కనపడింది.  అందుకు కారణం రాష్ట్రంలో గత సంవత్సరకాలంగా ఉన్న అనిశ్చితి, భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న సందేహం వలన సీమాంధ్రను అభివృద్ధి చేసే నాయకులు రావాలని, తిరగి పూర్వ వైభవాన్ని పోందాలనే తపన చాలామందిలో కనిపించింది.  ఏమో మనమనుకున్న నాయకుడు రాకపోతే అనే భయంతో అధికశాతం వోటర్లు వోటు హక్కును వినియోగించుకోవటం ద్వారా అభివృద్ధికి వోటేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles