Barclays ousting 19000 employees

Barclays ousting 19000 employees, Barclays CEO Antony Jenkins, Barclays Investment banking, Barclays Banking, More Barclays retrenchment in UK

Barclays ousting 19000 employees

బార్క్లేస్ లో 19000 ఉద్యోగుల మీద వేటు!

Posted: 05/08/2014 03:45 PM IST
Barclays ousting 19000 employees

బ్యాంకింగ్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి 300 సంవత్సరాల అనుభవమున్న బార్క్లేస్ 2016 వరకు ఎక్కువగా యుకె లోనే 19000 మంది ఉద్యోగులను తీసివెయ్యటానికి నిర్ణయించుకుంది.  అందులో 7000 మంది మీద వేటు వెంటనే పడబోతోంది.  

పోయిన సంవత్సరం 32 శాతం లాభాలు తగ్గిపోగా ఆ సంస్థ 10 శాతం బోనస్ ని ప్రకటించటం మీద విమర్శలు ఎదుర్కుంది.  బ్యాంకింగ్ సంస్థను ఆర్థికంగా నిలబెట్టటం కోసం ఉద్యోగులను తొలగించటమే కాకుండా పెట్టుబడులను కూడా కొన్నిటిని వెనక్కి తీసుకోబోతున్నదని సంస్థ సిఇవో ఆంటోనీ జెన్కిన్స్ అన్నారు.  ఆయన తన నిర్ణయం గురించి మాట్లాడుతూ ఇది కేవలం బార్క్లేస్ ని తగినంతగా కుదించటమే లక్ష్యంగా తీసుకుంటున్న చర్య అని చెప్పారు.  దీని వలన 2016 నాటికి సిబ్బంది కేవలం 120000 కి కుదించబడుతుందని అంచనా.  అయితే అంతకు ముందు ఆంటోనీ మాట్లాడుతూ సాంకేతికత పెరగటంతో సిబ్బంది తగ్గే అవకాశం ఉంటుందని, మొత్తం సిబ్బంది 100000 కి కుదించబడవచ్చని అన్నారు.  

పెట్టుబడులను వెనక్కి తీసుకోవటం వలన సంస్థ లాభాలు తగ్గవచ్చని విశ్లేషకులు చెప్తున్నా కంపెనీ షేర్ల ధర 3 శాతం పెరిగింది.  ఆంటోనీ జన్కిన్స్ కి ముందు బాబ్ డైమండ్ తయారు చేసి సిబ్బంది 24000 మందిలో 7000 మంది ఉద్యోగాలను పోగొట్టుకోబోతున్నారు.  

ఈ పరిణామం మీద కలత చెందిన యూనియన్లు బ్యాంకింగ్ సంస్థ చాలా శాఖలను మూసివేస్తుందని అనుమానిస్తున్నారు.  గతంలో ఉంటుందో ఊడుతుందో తెలియని స్థితిలో ఉన్న సంస్థకోసం శ్రమకోర్చి పనిచేసిన ఉద్యోగుల పట్ల సానుభూతితో ప్రవర్తించాలని యూనియన్ నాయకులు అంటున్నారు.  

ఈ నిర్ణయం వలన బార్క్లేస్ భవిష్యత్తులో ఎక్కువ శాతం లాభాలను ఆర్జిస్తూ ఆర్థిక పరంగా త్వరలోనే కుదుటపడుతుందని జెన్కిన్స్ అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles