ఈరోజు పవిత్రమైన వారణాసి నగరం భాజపా నిరసన జ్వాలను చవిచూసింది. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ వారణాసిలో ఎన్నికల ప్రచార సభలను నిర్వహించనుండగా వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ వాటికి అనుమతినివ్వలేదు. దానితో భాజపా నాయకులు అరుణ్ జైట్లీ, అమిత్ షా తో సహా ఎందరో కార్యకర్తలు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం దగ్గర ధర్నా చేసారు.
భద్రతా సమస్యలను చూపించిన ఎన్నికల కమిషన్ మీద అరుణ్ జైట్లీ విమర్శల వర్షాన్ని కురిపించారు. పక్షపాతంగా వ్యవహరించిన జిల్లా మేజిస్ట్రేట్ ను మౌనంగా సాక్షిలాగా చూస్తున్న ఎన్నికల కమిషన్ ని పిరికితనంగా ఆయన అభివర్ణించారు.
నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన ఎన్నికల కమిషన్ అలా చెయ్యకపోవటం వలనే మా కార్యకర్తలు సత్యాగ్రహానికి దిగవలసివచ్చిందంటూ నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేసారు. అయితే సంయమనాన్ని పాటించమని, వారణాసి ప్రజకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించవద్దని కార్యకర్తలకు ఆయన సూచించారు. గంగమ్మతల్లికి హారతి ఇచ్చే మోదీ కార్యక్రమం ఈ రోజు జరగనందుకు ఆయన ఆవేదనను వ్యక్తం చేస్తూ తల్లి మమకారం రాజనీతిని మించినదంటూ తెలియజేసారు.
అయితే ఎన్నికల కమిషన్ కూడా తన చర్యలను సమర్థించుకుంటూ కేవలం జిల్లా మేజిస్ట్రేట్ ఇచ్చిన నివేదికనే కాకుండా యుపి ఛీఫ్ సెక్రటరీ, డిజిపి లను కూడా సంప్రదించి, భద్రతా సమస్య వలన అనుమతినివ్వలేదని అన్నారు. భద్రతా విషయంలో సంబంధిత అధికారుల సూచనలను కాదని అనలేము కదా అని అన్నారు.
ఔనౌను రాహుల్ గాందీ రోడ్ షో సమయంలో లేని భద్రతా సమస్య బహిరంగ సభకు వచ్చింది అన్నారు జైట్లీ.
వారణాసిలో జరిగిన ధర్నాలో డిఎమ్ యాదవ్ దిష్టిబొమ్మను తగులబెట్టి ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసారు. దానితో బుధవారం సాయంత్రం ఐదు సభల్లో నాలుగిటికి ఆయన అనుమతినిచ్చారు. ఇప్పుడు చాలా ఆలస్యమైందని, సమయం సరిపోదని వాటిని కూడా తిరస్కరించారు మోదీ.
ఉత్తర్ ప్రదేశ్ లోని ఆజమ్ గడ్ లో మాట్లాడుతూ నరేంద్ర మోదీ, మూడు ఎన్నికలుగా చూస్తూవున్నాం, ఎన్నికల కమిషన్ పక్షపాతాన్ని చూపిస్తోందని అన్నారు. ఇలా చేస్తూ, ఢిల్లీలో కూర్చుని తమకొచ్చే సీట్ల లెక్కలు వేసుకుంటున్న వారి అంచనాలను వోటర్లు తారుమారు చెయ్యకమానరని ఆయన విమర్శించారు. దీని వలన తనకేదో నష్టం జరుగుతుందని, లోక్ సభ ఎన్నికల ఫలితాలలో మార్పు వస్తుందని అనుకుంటే అది వాళ్ళ తప్పే అవుతుందంటూ పరోక్షంగా యుపిఏ ప్రభుత్వాన్ని ఆయన ఎండగట్టారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more