Farmers protest on national highway

Farmers protest on National Highway, Heavy rains in AP, Heavy damage to farmers due to rain, Heavy rains in AP put farmers to loss

Farmers protest on National Highway

రోడ్డు మీదకు వచ్చిన రైతన్నలు !

Posted: 05/10/2014 12:46 PM IST
Farmers protest on national highway

వర్షం వలన తడిచిన ధాన్యం, నష్టపోయిన పంటతో ఎలాగూ రోడ్డున పడతాం కాబట్టి రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేద్దామని రైతలు జాతీయ రహదారి మీద ఆందోళన సాగిస్తున్న ఘటన హైద్రాబాద్ చౌటుప్పల్ లో చోటుచేసుకుంది.  

చౌటుప్పల్ యార్డ్ లో ధాన్యం కొనుగోళ్ళు నిలిపివేయటంతో వారం రోజులుగా రైతులు పడిగాపులు పడుతున్నారు.  అయినా ఎవరూ పట్టించుకోవటం లేదని అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోవటంతో ఆందోళన బాటపట్టామని వాళ్ళు చెప్తున్నారు.  అయితే జాతీయ రహదారి కావటంతో రోడ్డు మీద పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవటంతో పోలీసులు కలుగజేసుకుని వాళ్ళని చెదరగొట్టారు.  

రైతుల ఆందోళన సంగతి తెలిసి అక్కడకు పోయి విషయం తెలుసుకున్న భాజపా నాయకులు రైతులకు మద్దతు పలుకుతూ ఆందోళనలో పాల్గొన్నారు.  పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకుని అక్కడి నుండి తరలించారు.  ఆందోళనలో పాల్గొన్న భాజపా నాయకులు రాష్ట్ర కోశాధికారి గంగిడి మనోహర రెడ్డి, జిల్లా కార్యదర్శి దోనూరు వీరారెడ్డి.  

ఉన్నతాధికారులు దిగిరావాలి, ధాన్యం కొనుగోలు చెయ్యాలంటూ ఆందోళనకు దిగి అంత వరకూ ఆందోళన సాగిస్తామంటూ రోడ్డు మీద బైఠాయించిన రైతుల కోరిక తీరలేదు, ఆవేదనా తగ్గలేదు కానీ జాతీయ రహదారిలో రాకపోకలకు అడ్డు తగిలినందుకు వాళ్ళ మీద పోలీసులు విరుచుకుపడ్డారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles