Rahul roadshow where modi rally was denied

Rahul roadshow where Modi rally was denied, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014 videos, Lok Sabha Elections 2014

Rahul roadshow where Modi rally was denied at Varanasi

మోదీకి అనుమతి లేని చోట రాహుల్ రోడ్ షో!

Posted: 05/10/2014 01:10 PM IST
Rahul roadshow where modi rally was denied

వారణాసిలో ముస్లిం వోటర్లు ఎక్కువగా ఉన్నచోట భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీకి అనుమతి లభించని బేనియా బాగ్ ప్రాంతంలో రాహుల్ గాంధీ రోడ్ షోకి అనుమతి లభించటంతో దీని మీద భాజపా నాయకుడు అరుణ్ జైట్లీ ఈసి పక్షపాత బుద్ధి మీద ఆరోపణలు చేసారు.  

భద్రతా సమస్య దృష్ట్యా మోదీ సభకు అనుమతి ఇవ్వని ఈసి రాహుల్ గాంధీ రోడ్ షోకి అనుమతించారంటే, బేనియా బాగ్ లో కేవలం భాజపా విషయంలోనే భద్రతా సమస్య ఉందా అని ప్రశ్నించారు అరుణ్ జైట్లీ.  అంటే ఇది భద్రతా సమస్య కాదు కేవలం రాజకీయమే అన్నది స్పష్టమౌతోందని ఆయన అన్నారు.  

వారణాసిలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ కోసం ప్రచారం చెయ్యటానికి రాహుల్ గాంధీ గులామ్ నబీ ఆజాద్, ముకుల్ వాస్నిక్ లతో కలిసి వారణాసి చేరుకున్నారు.  గోల్ గడ్డా ప్రాంతం నుంచి సుమారు 11 కిలోమీటర్ల మేర రాహుల్ రోడ్ షో జరుగనుంది.  ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రోడ్ షో కూడా ఈరోజు వారణాసిలో జరుగనుంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles