Special package to residual andhra pradesh

Special package to Residual Andhra Pradesh, AP State Reorganization Bill 2014, Planning Department, Prime Minister Manmohan Singh special package to the state

Special package to Residual Andhra Pradesh

విభజన తర్వాత స్పెషల్ ప్యాకేజ్!

Posted: 05/12/2014 06:12 PM IST
Special package to residual andhra pradesh

ఒక పక్క ఎన్నికలు జరుగుతుండగానే మరోపక్క ప్లానింగ్ డిపార్ట్ మెంట్ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించిన విధంగా తెలంగాణాను వేరు చేసిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ ని సిద్ధం చేసింది.  13 జిల్లాలలో ఏడు జిల్లాలను అందుకు అర్హమైన ప్రాంతాలుగా ప్లానింగ్ శాఖ పరిగణలోకి తీసుకుంది.  అవి, కర్నూల్, అనంతపూర్, చిత్తూరు, కడప, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు.  

ప్యాకేజి కోసం ప్రణాళిక సిద్ధంగా ఉందని, కొత్త ప్రభుత్వం ఏర్పడగానే ప్రాజెక్ట్ కాస్ట్, ఇతర వివరాలను నిర్ణయించటం జరుగుతుందని ప్లానింగ్ శాఖ తెలియజేసింది.  

అభివృద్ధి క్రమంలో ఆయా జిల్లాలలో దృష్టి సారించే విషయాలు- వ్యవసాయం, నీటి నిల్వలు, సాగు నీరు, కరువు సాయం, ఆరోగ్యం, న్యూట్రిషన్, విద్య, పరిశ్రమలు.  ఐదు సంవత్సరాలపాటు ఇచ్చే ఈ ప్రత్యేక ప్యాకేజ్ లలో ప్రాజెక్ట్ ల మీద 90 శాతం గ్రాంట్, 10 శాతం ఋణం ఉంటుంది.  అదే మామూలుగా అయితే 30 శాతం రాయితీ, 70 శాతం ఋణం ఉంటుంది.  కొత్త పరిశ్రమలకు, ఇప్పటికే ఉన్న పరిశ్రమల అభివృద్ధికి కూడా చేయూతనీయబడుతుంది.  

రాష్ట్ర పునర్వ్యవస్థ బిల్లు 2014 లో లేకపోయినా ఇదే రకమైన ప్యాకేజ్ తెలంగాణా ప్రాంతంలో వెనకబడ్డ జిల్లాలైన మహబూబ్ నగర్, ఖమ్మం, అదిలాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాలకు కూడా ఇవ్వవచ్చన్నది ప్లానింగ్ శాఖ అభిప్రాయం.  

రఘురామ్ రాజన్ కమిటీ ప్రకారం వెనకబడివున్న ప్రాంతంగా గుర్తించటానికి 18 సూచికలున్నయి.  అవి, ఆదాయం, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, బీదరికపు నిష్పత్తి, మహిళా అక్షరాస్యత, ఎస్ సి ఎస్ టిలున్న శాతం, నాగరికత, అభివృద్ధి చెందిన నగరాలకు ఉన్న దూరం మొదలైనవి.  

ప్లానంతా తయారుగా ఉంది.  కేవలం ఎదురు చూపులు అప్పాయింటెడ్ డే తర్వాత అధికారంలోకి వచ్చి పగ్గాలు చేతబుచ్చుకునే ముఖ్యమంత్రి కోసమే.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles