ట్విట్టర్ అకౌంట్ పై ప్రధాని కార్యాలయంలో వివాదం చెలరేగింది. ట్విట్టర్‌లో ఉన్న తన అకౌంట్ హ్యాండిల్‌ను అకస్మాత్తుగా కాంగ్రెస్ మార్చివేసింది. దిగిపోతున్న కాంగ్రెస్ ఆ అకౌంట్ పేరును మార్చడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నీతిమాలిన రాజకీయాలను చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
పిఎంవో అకౌంట్ జాతి సంపద : బీజేపీ
ట్విట్టర్‌లో ఉన్న అకౌంట్ పేరును హ్యాండిల్‌గా పేర్కొంటారు. ఇప్పటివరకూ పీఎమ్‌ఓకు అట్ ద రేట్ ఆఫ్‌పీఎమ్‌వోఇండియా (@PMOindia) అనే పేరుతో ట్విట్టర్ అకౌంట్ ఉంది. దీనిని హఠాత్తుగా అట్ ద రేట్ ఆఫ్ పీఎమ్‌వో ఇండియా అర్కైవ్ అని మార్చేశారు. ఈ మార్పుతో ప్రధాని కమ్యూనికేషన్ సలహాదారు పంకజ్ పచౌరీ పీఎమ్‌ఓ అధికారిక సంభాషణలన్నీ సమాచార చట్టం కింద భద్రపరచడం జరుగుతోందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మార్పుపై బీజేపీ మండిపడింది.
ట్విట్టర్‌లో ఉన్న ప్రధాని కార్యాలయ అకౌంట్ జాతిసంపద అని బీజేపీ పేర్కొంది. అది అంతరాయం లేకుండా కొనసాగాలని అభిప్రాయపడింది. కాంగ్రెస్ తీరుపై ఆ పార్టీ మహిళా నేత మీనాక్షి ఉల్లేఖి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసిన పనికి ఆమె తప్పుపట్టారు. ట్విట్టర్ అకౌంట్ జాతిసంపద కాబట్టి దానిని సక్రమంగా భద్రపరచాల్సి ఉంది. అంతేకాక దానిని కొత్త పీఎమ్‌ఓకు అందజేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
కాంగ్రెస్ తీరుపై అభ్యంతరాలు...
మోడీకి వ్యక్తిగతంగానే 40 లక్షల మంది ఫాలోయర్లున్నారు. దానికి విరుద్ధంగా పీఎమ్‌ఓ అకౌంట్‌కు కేవలం 12.4 లక్షల మంది మాత్రమే ఫాలోయర్లున్నారు. ఏదేమైనా అది ప్రధాని కార్యాలయ అకౌంట్ కాబట్టి కాంగ్రెస్ మర్యాదగా దాన్ని తమకు అప్పగించాల్సిందని బీజేపీ వాదిస్తోంది. కాంగ్రెస్ తీరుపై అనేక మంది ట్విట్టర్ సభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more