Aap convenor arvind kejriwal arrest on defamation case

AAP convenor Arvind Kejriwal arrest, Kejriwal arrested on defamation case, Nitin Gadkary defamation case on Kejriwal

AAP convenor Arvind Kejriwal arrest on defamation case

ఆఆపా కేజ్రీవాల్ అరెస్ట్

Posted: 05/21/2014 04:58 PM IST
Aap convenor arvind kejriwal arrest on defamation case

నితిన్ గడ్కరీ మీద ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేసినందుకు అరవింద్ కేజ్రీవాల్ మీద వేసిన పరువు నష్టం దావా కోర్టుకి రాగా కేజ్రీవాల్ బెయిల్ బాండ్ ఇవ్వటానికి నిరాకరించటంతో ఆయనను అరెస్ట్ చెయ్యమని కోర్టు ఆదేశించింది.  

ఈ కేసు మీద విచారణను కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.  

తనని ప్రత్యేకంగా చూడాలని కేజ్రీవాల్ ఆశిస్తున్నారని, ఆయన్ని వెంటనే అరెస్ట్ చేసి తిహార్ జైలుకి తరలించమని కోర్టు ఆదేశించింది.  రూ.10000 కి బెయిల్ బాండ్ ఇవ్వటానికి కేజ్రీవాల్ తిరస్కరించటంతో కోర్టు ఆ విధంగా ఆదేశాలు జారీ చేసింది.  ఈ కేసులో ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరవటానికి అంగీకరించిన కేజ్రీవాల్ బెయిల్ బాండ్ ఇవ్వటానికి తిరస్కరించటంతో, అందులో ఆయనకొచ్చిన సమస్య ఏమిటి, నియమాలను పాటించాలి కదా, ఈ కేసు గురించి నియమాలను మారుస్తామా అని కోర్టు వ్యాఖ్యానించింది.  

అయితే, నేనేమీ తప్పు చెయ్యలేదు, ఇదేమీ క్రూరమైన నేరం కాదు.  నేను తప్పు చెయ్యనప్పుడు బెయిల్ కోరగూడదనే సిద్ధాంతాన్ని నేను పాటిస్తాను అని కేజ్రీవాల్ సమాధానమిచ్చారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles