Eamcet students 1 minute tension in today

today eamcet exam, eamcet 2014, eamcet test 2014, eamcet students 1 minute tension , EAMCET 2014 - Exam

eamcet students 1 minute tension in today

నేడే విద్యార్థులకు నిమిషం టెన్షన్!

Posted: 05/22/2014 08:17 AM IST
Eamcet students 1 minute tension in today

రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎంసెట్ పరీక్ష జరగనుంది. ఇంజనీరింగ్, వ్యవసాయ, వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజనీరింగ్ పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2.30 నుండి 5.30 గంటల వరకు అగ్రికల్చర్ అండ్ మెడికల్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులను ఉదయం 9 గంటల నుండి, అగ్రికల్చర్ అండ్ మెడికల్ విద్యార్థులను మధ్యాహ్నం 1.30 గంటల నుండి పరీక్ష హాలులోకి అనుమతించనున్నారు.

ఇంజనీరింగ్ పరీక్ష రాసేందుకు 2,82,799, వైద్య, వ్యవసాయ విద్య పరీక్ష రాసేందుకు 1,12,851 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ పరీక్షకు 523, వైద్య, వ్యవసాయ విద్య పరీక్షకు 227 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక 'కీ'ను ఈ నెల 24న ప్రకటించనున్నారు. అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన అనంతరం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి జూన్ 9వ తేదీన ర్యాంకులు ప్రకటించనున్నారు.

విద్యార్థులు ఆన్ లైన్ లో పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని విధిగా పరీక్ష కేంద్రంలో అందచేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీల విద్యార్థులు కులధృవీకరణ పత్రాలు తీసుకురావాల్సిన అవసరం లేదని ఎంసెట్ కన్వీనర్ రమణారావు వెల్లడించారు.

నిమిషం ట్రెరర్...

ఎంసెట్ విద్యార్థులను 'ఒక్క నిమిషం' నిబంధన వెంటాడుతోంది. ఒక్క నిమిషం నిబంధనను తొలగించాలని కోరినా ఎంసెట్ అధికారులు పట్టించుకోవడం లేదు. దీనితో ఏదో రకంగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఈ నిబంధన వల్ల ప్రతి సంవత్సరమూ సుమారు రెండు వందల మంది పరీక్ష రాయలేకపోతున్నారు. ఈ నిబంధన ఎంతమందిని నిరాశకు గురి చేయబోతోందో ?

ఎంసెట్ ప్రశ్నాపత్రం కోడ్ విడుదల

ఎంసెట్ ప్రశ్నా పత్రం కోడ్ ను అధికారులు విడుదల చేశారు. ఈరోజు నిర్వహించే ఎంసెట్ కోసం క్యూ కోడ్ ప్రశ్న పత్రం ఎంపిక చేశారు. కూకట్ పల్లిలోని జేఎన్ టీయూలో ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని .. విద్యార్థులు ఎలక్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి తీసుకురావద్దని ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles