Pizza delivery through drones in mumbai

pizza delivery through drones, Pizza by drone experiment in Mumbai, Free pizza ad of Paresh Rawal

pizza delivery through drones in Mumbai

ఇకపై ఫ్రీ పిజ్జా లేదు?

Posted: 05/22/2014 10:35 AM IST
Pizza delivery through drones in mumbai

లల్ల లల్లరే, పిజ్జా ఆయే ఫ్రీ- అని ఆనందంతో గంతులేస్తూ హిందీ సినీ నటుడు పరేష్ రావల్ పిజ్జా వ్యాపార ప్రకటనలో కనిపిస్తారు.  ఆర్డర్ ఇచ్చిన తర్వాత 30 నిమిషాల్లో మీ ఇంటికి డెలివరీ ఇవ్వనట్లయితే మీరు దానికి డబ్బులు చెల్లించనక్కర్లేదు.  పూర్తిగా ఫ్రీ అని ఒక పిజ్జా సంస్థ ప్రకటించింది.  అది కాకపోయినా పిజ్జా వేడి వేడిగా లేకపోతే తినలేరు కాబట్టి పిజ్జాల డెలివరీ త్వరగా చెయ్యవలసివుంటుంది.  అందుకే రయ్యి మని దూసుకుపోవటానికి పిజ్జా డెలివరీ బోయ్స్ కి బైక్ లు ఇస్తారు.  అయితే ముంబైలో రద్దీ కారణంగా పిజ్జా డెలివరీని సకాలంలో చెయ్యటం కష్టమే అవుతోంది.  అందుకో మార్గం ఎన్నుకుందో పిజ్జా సంస్థ.

ముంబైలో డ్రోన్ ల ద్వారా పిజ్జా డెలివరీలు చెయ్యటానికి శ్రీకారం చుట్టింది ఫ్రాన్సిస్కోస్ పిజ్జారియా అనే సంస్థ.  మానవ రహిత మినియేచర్ విమానంలో పిజ్జా డెలివరీ చెయ్యటానికి సాహసించి అందరినీ ఆశ్చర్యపరచింది.  విదేశాలలో డ్రోన్ లను వాడుతున్నారు.  అక్కడ కొరియర్ సర్వీస్ కి కూడా డ్రోన్ వాడటానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతునేవున్నాయి.  అయితే మామూలుగానే ఆక్కడి ఆకాశ మార్గం కూడా రద్దీగానే ఉంటుంది కాబట్టి కొన్ని మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు.

ముంబైలో పిజ్జా డెలివరీలకు డ్రోన్ లను ఉపయోగించి ఈ సంస్కృతికి నాంది పలికిన ఈ పిజ్జా సంస్థ ఒకటిన్నర కిలో మీటర్ దూరం వరకు వినియోగదారుడికి డెలివరీ ఇవ్వగలిగింది.  ప్రయోగాత్మకంగా ఈ నెల 11 న విజయవంతంగా చేసిన పిజ్జా డెలివరీని పూర్తి స్థాయిలోక తీసుకునివస్తామని ఆ సంస్థ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ మైఖేల రజనీ అన్నారు.  ప్రయోగాత్మకంగా ఉపయోగించిన డ్రోన్ ఖరీదు ఒక ఆటోమొబైల్ ఇంజినీర్ మిత్రుడి సాయంతో చేస్తేనే 1,20,000 ఖర్చైందట.  

డ్రోన్ లు 400 అడుగులకు మించిన ఎత్తులో ఎగరరాదన్న నిబంధన ఉంది.  ఇందులో ఇంధనం ఉపయోగించటం ప్రమాదం కనుక బ్యాటరీతో నడపటంతో అవి 8 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం పోలేవు.  డ్రోన్ లలో పంపించే వస్తువులు చాలా తక్కువ బరువు కలిగే ఉండాలి.  అయితే జిపిఎస్ సాయంతో ముందుగానే నిర్దేశించిన మార్గంలో నడుపుతూ డ్రోన్ ల ద్వారా పిజ్జా బట్వారా చేసే విధానాన్ని భవిష్యత్తులో అభివృద్ధి చేస్తామని అంటున్నారు మైఖెల్ రజనీ.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles