Main opposition in lok sabha

Main opposition in Lok Sabha, Trinamul Congress, Biju Janata Dal, All India Anna DMK, Trinamu BJD and AIADMK to join

Main opposition in Lok Sabha, Trinamul Congress, Biju Janata Dal, All India Anna DMK

ప్రధాన ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ కి ఎందుకు?

Posted: 05/22/2014 10:47 AM IST
Main opposition in lok sabha

బిజు జనతా దళ్, తృణమూల్ కాంగ్రెస్, అన్నా డిఎమ్ కే పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకుండా చెయ్యాలని అనుకుంటున్నాయి.  బిజు జనతా దళ్ కి ఒడిశా లో 20 సీట్లు, తృణమూల్ కి పశ్చిమ బెంగాల్ లో 34, తమిళనాడులో అన్నా డిఎమ్ కే కి 37 పార్లమెంట్ స్థానాలు దక్కి మొత్తం కలిపితే 91 కి చేరుతుండటంతో కాంగ్రెస్ స్థానంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం ఈ మూడు పార్టీలు సంఘటితమౌతున్నాయి.  ఈ విధంగా కలిసినట్లయితే కొత్త లోక్ సభలో కాంగ్రెస్ కంటే మంచి హోదాలో ఉండవచ్చని భావిస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీకి 44 పార్లమెంట్ సీట్లు, యుపిఏ కూటమికి 59 సీట్లు మాత్రమే వచ్చాయి.  

ప్రతిపక్ష నాయకత్వం, డెప్యూటీ స్పీకర్, పబ్లిక్ అకౌంట్స్ ఛైర్మన్ పోస్ట్ ల విషయంలో ఒక అవగాహనకు రావటం కోసం తృణమూల్ కాంగ్రెస్ కృషిచేస్తోంది.  భువనేశ్వర్ లో బిజెడి అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ నివాసంలో శనివారం నాడు అన్నా డిఎమ్ కే, ఇంకా ఇతర పార్టీలతో కలిసి పనిచేసే విషయంలో నిర్ణయాలు తీసుకోనున్నారు.  

ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో తృణమూల కాంగ్రెస్ అధ్యక్షురాలు మమత బెనర్జీ తమిళనాడు ముఖ్యమంత్రి జయ లలిత తో, కాంగ్రెస్ భాజపాలు కాకుండా ఇతర ప్రాంతీయ పార్టీలను కలుపుకునిపోదామని అన్నారు.  అందుకు జయలలితకు ప్రధానమంత్రి పదవిని కట్టబెట్టటానికి కూడా ఆమె తయారయ్యారు.  జయలలితకు ఒడిశా ముఖ్యమంత్రితో సత్సంబంధాలు ఎలాగూ ఉన్నాయి.  నవీన్ పట్నాయక్ చెన్నై వచ్చినప్పుడు ఆయనను తన సోదరుడు అని చెప్పుకున్నారు జయలలిత.  

ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు మర్చి పోవటానికి ఎక్కువ సమయం పట్టదు! 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles