Muslims not in minority in india minority minister says

Muslims not in Minority in India- Minority Minister says, Minority affairs Minister Najma Heftullah, Parsis are more in minority than Muslims, Minority Welfare does not mean Muslims

Muslims not in Minority in India- Minority Minister says

ముస్లింలు మైనారిటీ ఎలా అవుతారు?

Posted: 05/28/2014 09:47 AM IST
Muslims not in minority in india minority minister says

కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖామాత్యురాలు నజ్మా హెప్తుల్లా మాట్లాడుతూ మైనారిటీ వ్యవహారాల శాఖ అంటే మొత్తం మైనారిటీలందరి సంక్షేమం కోసం పనిచేసే శాఖే కానీ ముస్లింల కోసం పనిచేసే శాఖ కాదని వివరణనిచ్చారు.  దేశ జనాభాలో 13.4 శాతం ఉన్న ముస్లింలు మైనారిటీ వర్గానికి చెందినవారెలా అవుతారని ఆవిడ ప్రశ్నించారు.  

సాంఘికాభివృద్ధికి పనిచేసే ప్రభుత్వంలో కేవలం ఒక వర్గ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచెయ్యటముండదని అన్న నజ్మా నెఫ్తుల్లా, 2001 జనభా లెక్కల ప్రకారం 13.80 కోట్లమంది ముస్లింలు ఉన్నారని, అది భారతీయ జనాభాలో 13.4 శాతమని తెలియజేసారు.  

ముస్లింలకు రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హామీ అని, రిజర్వేషన్ ముస్లింల అభివృద్ధికి దోహదం చేస్తుందని లేదని, అన్ని మైనారిటీ వర్గాలకు విద్యావకాశాలను మెరుగుపరచటం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టదలచుకున్నట్లుగా చెప్పారు.  

అందరికంటే మైనారిటీ వర్గం ఫార్సీలని, వారి సంఖ్య రానురాను తగ్గిపోతోందని నజ్మా హెఫ్తుల్లా తెలియజేసారు.  

కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేసిన నజ్మా హెఫ్తుల్లా 2004 లో భాజపా లో చేరి ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు.  ఆమె స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మునిమేనకోడలు!  ఈమె భాజాపాలో ఏకైక ముస్లిం నాయకురాలు!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles