Fast buck earning ttd staff in queue complex

TTD staff in earing a fast buck, Fast buck earning TTD staff in queue complex, TTD EO to set up CC Cameras in queue complexes

Fast buck earning TTD staff in queue complex

అరచేతిలో వైకుంఠం- తితిదే సిబ్బంది చేతివాటం

Posted: 05/28/2014 11:20 AM IST
Fast buck earning ttd staff in queue complex

మీకు తిరుమలేశుని శీఘ్ర దర్శనం కావాలా.  మీ ఇష్టం జనరల్ క్యూలో నిలబడితే నిలబడండి కానీ త్వరగా పని ముగించుకోవాలంటే దానికో వెల ఉంది.  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు భక్తులకు అనధికార వెసులుబాటు, అందుకో ధర.  

సరే డబ్బులిచ్చారు వెసులుబాటును ఉపయోగించుకున్నారు, మరి మధ్యలో ఎవరైనా అడిగితే, అందుకూ మార్గముంది.  అలా డబ్బులిచ్చిన వారి చేతిలో ఆకుపచ్చ రంగు మార్క్ వేస్తారు.  ఇది క్యూ కాంప్లెక్స్ లో విధుల్లో ఉన్న అధికారులు తప్ప మరెవరూ చెయ్యలేరు.  వీరికోసం పనిచేసేవారు క్యూ కాంప్లెక్స్ లో ఉన్న భక్త బృందాలలో ఎక్కువ సంఖ్యలో ఉన్నవారిని కనిపెట్టి, వాళ్ళలో అసహనాన్ని గమనించి, వారికి సులభోపాయాన్ని సూచిస్తారు.  వాళ్ళు మెత్తబడుతున్నట్లుగా కనిపిస్తే అప్పుడున్న పరిస్థితినిబట్టి వారికో రేటు ని తెలియజేస్తారు.  సామాన్యంగా తలకింతని (గుండుకింతని) లెక్కకట్టి చెప్తారు.  ఒప్పందమంతా సరిగ్గా జరిగితే వాళ్ళ అరచేతుల మీద ఆకుపచ్చరంగుతో మార్క్ చేసి, ఎవరైనా అడిగినట్లయితే దాన్ని చూపించమని చెప్తారు.  ముట్టవలసిన డబ్బు ముట్టిందనటానికి, సిబ్బంది చేతివాటానికి భక్తుల చేతిలో ఆ ఆకుపచ్చ సిరా మార్క్ సంకేతం.  అంటే భద్రతా నిఘా సిబ్బందికి కూడా ఇందులో ప్రమేయముందన్నమాట.  

ఎక్కువగా రూ.300 పెట్టి ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకున్నవారిలో కనిపించే త్వరగా వెళ్ళాలన్న అసహనాన్ని కనిపెడతారు చేతివాటం చూపించటం కోసం.  అయితే వాళ్ళే కాదని, సందర్బాన్నిబట్టి ఇతర క్యూలలో ఉన్నవారిలో ఈ ఏర్పాటుకు పడేవారిని కూడా పసిగట్టి వాళ్ళ దగ్గరికి పోయి ఈ వెసులుబాటును విశదీకరించి వాళ్ళనీ ఇందులోకి లాగుతారని భద్రతా సిబ్బందిలో లోపాయి కారి విషయాలన్నీ తెలిసిన ఒక అధికారి తన పేరును అజ్ఞాతంగా ఉంచమని కోరుతూ వివరాలను తెలియజేసారు.  

ఈ విషయాన్ని ఒక మీడియా సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానముల యాజమాన్యం దగ్గర ప్రస్తావించగా, తప్పు చేసేవారిని వదిలేది లేదని, వారికి కఠిన శిక్షలుంటాయని తితిదే ఎగ్జిక్యూటివి ఆఫీసర్ ఎమ్ జి గోపాల్ అన్నారు.  ఇలాంటి వారి ఆటలను కట్టించటానికి క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలోను సిసి టివిలను అమర్చే నిర్ణయాన్ని తీసుకోబోతోందని గోపాల్ తెలియజేసారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles