ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈరోజు అసెంబ్లీలో ఆవేశంగా మాట్లాడి కొన్ని నిజాలు బయట పెట్టారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఆరు పదులు వయసు నిండినా కూడా చంద్రబాబు చురుకుతనం బాగానే ఉందని ఈరోజు అసెంబ్లీ సాక్షిగా రుజువైంది.
సీమాంద్ర కోసం చంద్రబాబు కష్టపడి విధానం పై ఆయన పూసగుచ్చినట్లు సభసాక్షిగా చెప్పటం జరిగింది. జగన్ పదే పదే బాబు రెచ్చగొట్టడంతోఆయనలో మరో మనిషి ఈరోజు బయటకు వచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో నేను అనుభవించిన నరకం ఎవరు అనుభవించలేదని బాబు ఉద్వేగంగా చెప్పటం జరిగింది. ఇప్పటి వరకు చంద్రబాబులో ఉన్న ఆవేశం, ఉద్వేగం కొన్ని సమయాల్లోనే బయట పడుతుంది.
వైఎస్ జగన్ అండ్ కో సభలో కాకి గోల చేయటంతో.. ఆ గోలకు అడ్డుకట్టవేయటానికి బాబు తీవ్ర ప్రయత్నం చేయటం జరిగింది. అధికారంలో ఉండగా రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోలో సమైక్యరాష్ట్రం అని పేర్కొని ఎన్నికల్లోకి వెళ్లి ఓటమి పాలయ్యామని చంద్రబాబు తెలిపారు. విభజన వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నానని అన్నారు. విభజన కారణంగా నిద్రలేని రాత్రులు గడిపానని ఆయన వెల్లడించారు. నిద్రపోకుండా గంటల కొద్దీ మేధావులతో చర్చలు జరిపానని ఆయన వెల్లడించారు.
అప్పుడు 'నీకేం కావాలో చెప్పు' అంటూ కాంగ్రెస్ పార్టీ తనను వ్యక్తిగతంగా మాట్లాడి అవమానపరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా దక్కకుండా నాశనమైపోయిందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో చెప్పిందే తెలంగాణలోనూ చెప్పామని ఆయన అన్నారు.
తనను 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఆదరించి ప్రజల్లో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అని... మీడియా వారు, తెలంగాణ ప్రతినిధులు పదేపదే ప్రశ్నించారని ఆయన తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఎక్కడ తెలుగు వారికి అన్యాయం జరిగినా టీడీపీ స్పందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తనకు రెండు ప్రాంతాలు రెండు కళ్లని ఆయని తెలిపారు.
టీడీపీ ఆవిర్భావమే తెలుగు ప్రజలను ఏకం చేసేందుకని, విభజించేందుకు కాదని ఆయన తెలిపారు. హైదరాబాద్ లాంటి నగరాన్ని కట్టాలంటే నాలుగు నుంచి ఐదు లక్షల కోట్ల రూపాలు ఖర్చవుతుందని ఆయన తెలిపారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు హైదరాబాద్ పై యాభై ఏళ్లపాటు ఖర్చు పెడితే ఇప్పుడున్న నగరం తయారైందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని వనరులు ఉన్నాయి... కానీ అభివృద్ధి సాధించాలంటే విజన్ ఉండాలని ఆయన బల్లగుద్ది మరీ చెప్పారు.
అయినా చంద్రబాబు ఎవరి కోసం నిద్రలేని రాత్రులు గడిపావ్ ! ఒక్కాసారి ఆలోచించు, తెలుగు ప్రజల కోసం, తెలుగుదేశం పార్టీ కోసం, మీకు అధికారం కోసమే కదా అని వైసీపీ నాయకులు అంటున్నారు. అయినా రాష్ట్రం విడిపోవటం వల్ల ఎక్కవుగా లాబాపడింది మీరేనని వైసీపీ నేతలు అంటున్నారు. ఏమైన చంద్రబాబులో చాలా నిజాయితి ఉందనే విషయం జగన్ అండ్ కో ఎప్పటికి తెలుచుకుంటారో చూద్దాం.
కొసమెరుపు : ఒక ప్రాంతానికి చెందిన ఇద్దరు రాజకీయ నాయకులు మాటల యుద్దం చేసుకోవటం వల్ల, ఆ రాష్ట్రం యొక్క అభివ్రుద్ది ఆగిపోతుందనే విషయం తెలుసుకోవాలి? ఎవరు కోసం మీరు కొట్టుకుంటున్నారు? ఎందు కోసం మీరు పోరాటం చేస్తున్నారు? సీమాంద్ర అభివృద్ది కోరుకున్నవారైతే, ప్రజలకు ఉపయోగపడే.. వాడిపై వాడి వేడిగా చర్చలు జరపండి? అంతేగానీ మీరు ఒక్కరిపై చొల్లు విమర్శలు చేసుకోవటానికి, కష్టాల్లో కొలిమిలో కొట్టుమిటాడుతున్న సీమాంద్ర ప్రజల ప్రాణాలతో చెలకగటం ఆడకండని తెలుగు ప్రజలు కోరుతున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more