Arrest warrant against dhoni for given add in lord vishnu avatar

arrest warrant against dhoni for given add in lord vishnu avatar, dhoni was portrayed as god vishnu, mahendra singh dhoni, indian cricket team captain mahendra singh dhoni, complaint against ms dhoni,

arrest warrant against dhoni for given add in lord vishnu avatar

ధోనీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తారా?

Posted: 06/24/2014 04:28 PM IST
Arrest warrant against dhoni for given add in lord vishnu avatar

సెలబ్రిటీలకు ..అప్పుడప్పుడు కొన్ని కష్టాలను కొని తెచుకుంటారు. అలాంటి వారిలో ఇప్పుడు మన టీమిండియా కెప్టెన్ మహేంద్ సింగ్ దోనీ ఉన్నారు. టీమిండియా కెప్టెన్ ఆంద్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయటానికి సిద్దమువుతున్నారు. ఇది నిజంగా జరుగుతుందా? ధోనీ ఒక విఐపి కేటగిరిలో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి ఆంద్రప్రదేశ్ కు తీసుకురాగలరా? ఒకవేళ ధోనిని అరెస్ట్ చేస్తే.. దేశం వ్యాప్తంగా.. ధోని అభిమానులు ఊరుకుంటారా? పెద్ద గొడవలే జరిగిపోతాయి.

అసలే ఆంద్రప్రదేశ్ పేరు వింటే మిగిలిన రాష్ట్రాల వారికి ముందుగా గుర్తుకు వచ్చేది.. ‘‘పార్లమెంట్ పెప్పర్ స్ర్పే’’. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ లీడర్ ..విజయవాడ ఎంపీ అయిన లగడపాటి రాజగోపాల్ వాడిన పెప్పర్ స్ర్పే గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆంద్రప్రదేశ్ పేరు మారుమ్రోగిపోయింది. అప్పటి నుండి ఆంప్రదేశ్ రాష్ట్రం పేరు వినబడితే చాలు పక్క రాష్ట్రాల వారు వింతగా చూస్తున్నారు.

Mahendra-Singh-Dhoni

ఇప్పుడు ధోని అరెస్ట్ ..ఆంద్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా కోర్టు కావటం ఆశ్చర్యంగా ఉంది. ధోనీని వెంటనే అరెస్ట్ చేయాలంటూ అనంతపురం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2013లో బిజినెస్ టుడే మ్యాగజైన్ లో విష్ణుమూర్తి అవతారంలో ధోని పలు రకాల వస్తువులను , పాదరక్షలను చేతిలో పట్టుకున్నట్లు ముద్రించారు. దీంతో హిందూ దేవతలను అవమానపరిచేలా ధోనీ వ్యవహరించాడని విశ్వహిందూపరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ ఫిబ్రవరిలో పిటిషన్ దాఖలు చేశారు.

ఈరోజు ఈ పిటిషన్ పై ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ధోనీ సమన్లు అదుకోకపోవడంతో ఆయనకు జిల్లా జడ్జి విజయ్ కుమార్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. వచ్చే నెల 16న ధోనీని కోర్టులో హాజరు పరచాలని పోలీసులను ఆదేశించారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు ధోనీకి ఇప్పటి వరకు మూడు సార్లు సమన్లు జారీ చేసింది. అయినా ధోనీ ఇంతవరకు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఈ రోజు ధోనీకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ధోని అరెస్ట్ పై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ధోని అరెస్ట్ పై ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే.. జూలై 16 వరకు ఆగాల్సిందే.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles