Delhi court summons sonia and rahul gandhi

national herald case, delhi court summons sonia and rahul gandhi, subramaniam swamy petition on national herald misappropriation, sonia and rahul to appear court on august 7

Delhi Court summons Sonia and Rahul Gandhi

సోనియా రాహుల్ కి కోర్టు సమన్లు

Posted: 06/26/2014 04:09 PM IST
Delhi court summons sonia and rahul gandhi

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు నేషనల్ హెరాల్డ్ సంస్థలో జరిగిన ఆర్థిక అవకతవకల మీద విచారణకు ఢిల్లీ కోర్టుకి హాజరుకావలసిందిగా నోటీసులు జారీ అయ్యాయి.  

నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రిక చాలాకాలంగా మూతపడివుంది.  అందులో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ భారతీయ జనతా పార్టీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ మీద మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గౌమతి మనోచా సమన్లను జారీచేసారు.  ఈ కేసులో ప్రాథమికంగా అవకతవకలు జరిగాయన్నది నిరూపితమైనదని మేజిస్ట్రేట్ ఈ సందర్భంగా అన్నారు.  

నేషనల్ హెరాల్డ్ ఆస్తులలో 2000 కోట్ల రూపాయల మేరకు అక్రమాలు జరిగాయన్న అభియోగంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండేజ్, శ్యామ్ పిట్రోదాలకు కూడా ఆగస్ట్ 7 న కోర్టులో హాజరుకావలసిందిగా సమన్లు జారీ అయ్యాయి.  

1938 స్వతంత్ర భారత ప్రధమ ప్రధానమంత్రి జవహార్ లాల్ నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రిక 2008 లో మూతబడింది.  

అంతకు ముందుకూడా సుబ్రహ్మణ్య స్వామి కాంగ్రెస్ పార్టీ నిధులను తన కుటుంబీకులచేత నడపబడుతున్న సంస్థలకు మళ్ళించారని, నేషనల్ హెరాల్డ్ హౌస్ లో కొంతభాగం పాస్ పోర్ట్ విభాగానికి అద్దెకు ఇచ్చారని, అది వార్తాపత్రిక కోసమే ఉపయోగించాలి కానీ అలా వేరే పనికి వేరే సంస్థకి లీజ్ కి ఇవ్వటం నియమాలకు విరుద్ధమని, 1600 కోట్ల రూపాయల ఖరీదు చేసే హెరాల్డ్ హౌస్ ని, ఇంకా ఢిల్లీలోను, యుపి లోను ఉన్న హెరాల్డ్ హౌస్, ఖ్వామీ అవాజ్ ఆస్తులను కాజేయటానికి చూస్తున్నారని ఆరోపించారు.

లోగడ జనతా పార్టీకి అధ్యక్షుడుగా వ్యవహరించిన సుబ్రహ్మణ్య స్వామి ఆగస్ట్ 11, 2013 న జనతా పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles