Narendra modi govt on price increasing

rail fair hikes, pm narendra modi, raising cooking gas and kerosens rates, monsoon delayed across indiam bjp government, fast track court, modi cabinet meeting

Narendra Modi govt

వర్షాభావానికి పెరుగుతున్న ధరలకు మోదీ ప్రత్యామ్నాయాలు

Posted: 06/26/2014 06:25 PM IST
Narendra modi govt on price increasing

వర్షాలు పడక దేశంలో వివిధ ప్రాంతాలలో రైతులు నానా అవస్తలు పడుతున్నారు.  ఈ నేపథ్యంలో పెరుగుతున్న ధరలకు కళ్లెం వెయ్యటానికి ప్రధాన మంత్ర నరేంద్ర మోదీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతో చేపట్టగల ప్రత్యామ్నాయ పద్ధతులను సూచించారు.  అందులో భాగంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను తెరచి, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ చేసేవారిని విచారించమని అన్నారు.

క్యాబినెట్ సమావేశంలో ఈ రోజు మోదీ వర్షాల గురించి, నీరు, విద్యుత్, విత్తనాల వితరణ విషయంలో వివరాలను అడిగి తెలుసుకుని, వర్షాభావం వలన రైతులు నష్టపోకుండా వాటిని సమృద్ధిగా అందేట్టుగా చూడాలని అన్నారు. ఋతుపవనాలు చాలా బలహీనంగా ఉన్నాయని, కానీ అవి పుంజుకునే అవకాశం ఉందని సమావేశంలో చెప్పటం జరిగింది.  

ఈ సందర్భంలో మోదీ మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రం సంపూర్ణ సహకారంతో పనిచేస్తూ ప్రణాళికలో రాష్ట్రాలను కాకుండా జిల్లాల స్థాయిలో పరిశీలనలు, నిర్ణయాలు తీసుకోవటం చెయ్యాలని అన్నారు.  రెండు గంటల పాటు నడిచిన క్యాబినెట్ మీటింగ్ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం ఈ వివరాలను మీడియాకు అందజేసింది.  

ఢిల్లీలో ఉల్లిపాయల కొరత ఇప్పుడు లేదని, రాబోయే కాలంలో బియ్యం సరిపోను పరిమాణంలో నిల్వలను పెట్టుకోవాలని సూచించటం జరిగిందని కూడా ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది.

జూన్ 17 నాటికి దేశవ్యాప్తంగా 45 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.  రాజధానిలో ఉల్లిపాయలు బంగాళ దుంపల ధరలు కిలో రూ.25 నుంచి 30 వరకు చేరుకున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles