Gail pays compensation to gas leak victims

nagaram victims paid compensation, gail pays compensation to gas leak victims, ap state govt pays compensation to gas leak victims, timely payment of ex-gratia by gail and govt

GAIL pays compensation to gas leak victims

పరిహారం చెల్లిస్తే నష్టం పోదు కానీ...

Posted: 07/01/2014 10:56 AM IST
Gail pays compensation to gas leak victims

నష్టపరిహారం చెల్లించినంత మాత్రాన తప్పు ఒప్పు కాదు, జరిగిన నష్టాన్ని పూరించటమూ అవదు.  కానీ తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో జూల్ 27 న గెయిల్ గ్యాస్ పైప్ లీక్ వలన జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు ఇస్తామని అన్న సొమ్మును సత్వరమే చెల్లించి నిజాయితీని చాటుకోవటం జరిగింది.

బాధితులను వెంటనే పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు నష్టపరిహారాన్ని కూడా ప్రకటించటం, మూడు రోజుల్లోనే కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి, గెయిల్ సంస్థ నుంచి బాధితుల కుటుంబాలకు ఇచ్చిన హామీని నెరవేర్చటం వలన అటు కేంద్ర ప్రభుత్వం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజానీకానికి తమ నమ్మకం వమ్ము కాలేదన్న భావన కలుగుతోంది.  భాజపా, తెదేపా లో మీద నమ్మకం పెట్టుకుని గెలిపించి తప్పు చెయ్యలేదన్న నమ్మకం ఏర్పడుతోందని అక్కడి స్థానికులు అంటున్నారు.

ఆ దురదృష్టకరమైన ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలకు గెయిల్ తరఫునుంచి 20 లక్షలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 లక్షలు మొత్తం 25 లక్షలకు హామీలు ఇవ్వటం జరిగింది.  అందులో కేంద్ర నుంచి రావలసిన 2 లక్షలు ఇంకా రాలేదు కానీ 20 మంది మృతుల కుటుంబాలకు రూ.23 లక్షలు చెల్లించటం జరిగింది.  ప్రాణం విలువ ఎవరూ కట్టలేరు.  కానీ జరిగిన నష్టానికి సకాలంలో పరిహారాన్ని చెల్లించటంతో ఆ కుటుంబాలకు ఊరట మాత్రం కలిగింది.  

ఉప ముఖ్యమంత్రి, హోం శాఖామాత్యులు చినరాజప్ప, దేవాదాయ శాఖామంత్రి మాణిక్యాలరావు, సోమవారం నాడు మొత్తం 5.5 కోట్ల రూపాయల విలువైన చెక్కులను బాధితుల కుటుంబాలకు అందజేసారు.  మృతులకే కాకుండా క్షతగాత్రులకు 19 మందిని గుర్తించి వారికి ఒక్కొక్కరికి రూ.50 వేల రూపాయల చెక్కులను అందజేసారు.  ఇంకా కేంద్రం నుంచి మరో రూ.50000 కు చెక్కు వారికి అందనుంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles