Nagarjuna n convention in land grabbing case

ghmc notices to n convention, nagarjuna n convention in land grabbing case, akkineni nagarjuna petitions in high court, nagarjuna petition against ghmc n

ghmc notices to n convention

అమితుమి తేల్చుకునే దిశగా నాగ్

Posted: 07/01/2014 11:41 AM IST
Nagarjuna n convention in land grabbing case

అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ నిర్మాణంలో చెరువులోని మూడు ఎకరాల భూమిని అనధికారికంగా కబ్జా చేసారన్న ఆరోపణతో దానిమీద గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు అంటించారు.  దానితో నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు.  ఎన్ కన్వెన్షన్ కోసం మూడున్నర ఎకరాల స్థలాన్ని కొనుగులో చేసి ఆరున్నర ఎకరాల్లో నిర్మాణం చేసారన్నది జిహెచ్ఎమ్ సి అభియోగం.

గురుకుల్ ట్రస్ట్ లో మిగిలినవారి కట్టడాలకు కనీసం నోటీసులు కూడా లేకుండా కూల్చివేయటం జరిగింది.  కానీ ఎన్ కన్వెన్షన్ భవంతిని కూల్చివేయటమా లేకపోతే దాన్ని ప్రభుత్వం మరో పనికి వాడుకోవటమా అన్న నిర్ణయం ఇంకా జరగలేదు. 

రాజకీయంగా ఈ చర్య ముఖ్యమంత్రి కెసిఆర్ ని మరింత ఎత్తుకు తీసుకునిపోతోందనటంలో అనుమానం లేదు.  మన భూములను మనం కాపాడుకుందాం అని తెలంగాణా ప్రజలకు చేసిన వాగ్దానం, ప్రభుత్వం భూమిని అంగుళం కూడా వదలం కబ్జా దారుల నుంచి వసూలు చేస్తాం అని చేసిన సవాల్ ఒట్టి మాటలే కాదని ఈ చర్య ద్వారా నిరూపితమౌతోంది.  

అంతేకాకుండా, అక్రమ నిర్మాణాలను కూల్చివేయటానికి నోటీసులెందుకని, వెంటనే ఆ పని చెయ్యమని సర్వాధికారాలనిచ్చిన కెసిఆర్, చిన్నా పెద్దా ఎవరికి చెందిన నిర్మాణాలనైనా కూల్చివేస్తారా అంటూ వచ్చిన వ్యాఖ్యలకు, కోట్ల రూపాయల విలువచేసే నాగార్జున ఎన్ కన్వెన్షన్ మీద కూడా చర్య తీసుకోవటం, ఔనంటూ సమాధానమిచ్చినట్లవుతోంది.  

చట్టం ద్వారా న్యాయస్థానం తీర్పు ఏది వచ్చినా ప్రజా తీర్పు మాత్రం కెసిఆర్ పక్షమే ఉంటుందన్నది నిస్సందేహం.  అందుకు తార్కాణమే సర్వే చెయ్యటానికి జిహెచ్ఎమ్ సి అధికారులు ఎన్ కన్వెన్షన్ కి పోయినప్పుడు అక్కడ గుమికూడిన తెలంగాణా వాదులు చేసిన ఆందోళన, కట్టడాలను కూల్చివేయమని చేసిన నినాదాలు.

నాగార్జున హైకోర్ట్ మీద వేసిన పిటిషన్ ని కోర్టు రేపు పరిశీలించే అవకాశం కనపడుతోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles